Share News

IND vs AUS: నిలువునా ముంచిన బ్యాటర్లు.. భారత్ ఘోర పరాజయం

ABN , Publish Date - Dec 08 , 2024 | 11:19 AM

ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. భారత్ తరఫున నితీష్ కుమార్ రెడ్డి 42 పరుగులు చేయగా.. లీడ్ తీసుకున్న కొద్ది క్షణాలకే పాట్ కమిన్స్ చేతికి చిక్కి నితీష్ కుమార్ రెడ్డి ఔటయ్యాడు. దీంతో భారత్ కు భారీ షాక్ తగిలింది.

IND vs AUS: నిలువునా ముంచిన బ్యాటర్లు.. భారత్ ఘోర పరాజయం
Team India

ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్‌లో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచులో మొదటి ఇన్నింగ్స్ లో 180 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ లోనూ భారత్ చతికిలపడింది. మొత్తం 36.5 ఓవర్లు ఆడిన భారత్ 175 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్18 పరుగుల లీడ్ లోకి వచ్చింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు 19 పరుగుల లక్ష్యాన్ని కేవలం.. 3.2 ఓవర్లలోనే చేధించి 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ ను భారత జట్టు 1-1 తేడాతో సమం చేసింది. భారత బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి(47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 42) మినహా మిగిలినవవారెవ్వరూ రాణించలేదు.

భారత్ తరఫున నితీష్ కుమార్ రెడ్డి 42 పరుగులు చేయగా.. లీడ్ తీసుకున్న కొద్ది క్షణాలకే పాట్ కమిన్స్ చేతికి చిక్కి నితీష్ కుమార్ రెడ్డి ఔటయ్యాడు. దీంతో భారత్ కు భారీ షాక్ తగిలింది. సిక్సర్ కొట్టిన వెంటనే భారీ హిట్ కి ప్రయత్నించిన నితీష్ టైమింగ్ సరిగా లేకపోవడంతో బోల్తా కొట్టాడు. ఫలితంగా, బంతి థర్డ్ మ్యాన్ వద్ద నాథన్ మెక్‌స్వీనీ చేతుల్లోకి వస్తుంది. ఆస్ట్రేలియా సారథి ఐదు వికెట్ల ప్రదర్శన పూర్తి చేయడంతో భారత్‌కు తొమ్మిదో వికెట్ పోయింది. మంచి బౌలింగ్ ప్రయత్నం చేసినప్పటికీ, సందర్శకులకు 157 పరుగుల ఆధిక్యాన్ని అందించారు.

Updated Date - Dec 08 , 2024 | 11:28 AM