IND vs AUS: టీమిండియా చెత్త రికార్డు.. ఇంతకంటే అవమానం లేదు
ABN, Publish Date - Dec 08 , 2024 | 02:41 PM
IND vs AUS: పింక్ బాల్ టెస్ట్‌లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది టీమిండియా. పెర్త్ టెస్ట్‌లో గ్రాండ్ విక్టరీతో బీజీటీని సూపర్బ్‌గా స్టార్ట్ చేసిన భారత్.. రెండో టెస్టులో చతికిలబడింది.
పింక్ బాల్ టెస్ట్‌లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది టీమిండియా. పెర్త్ టెస్ట్‌లో గ్రాండ్ విక్టరీతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సూపర్బ్‌గా స్టార్ట్ చేసిన భారత్.. రెండో టెస్టులో చతికిలబడింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమైన మెన్ ఇన్ బ్లూ 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఓటమి కంటే కూడా రోహిత్ సేన ఓడిన తీరు, ఆడిన విధానం మీద తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.
సరెండర్
అడిలైడ్ టెస్ట్‌లో ఆసీస్ ముందు సరెండర్ అయిపోయింది భారత్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా బ్యాటర్లంతా ఫెయిల్ అయ్యారు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఒక్కడే కంగారూ బౌలర్లకు ఎదురొడ్డి పోరాడాడు. బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ రాణించినా.. అంచనాలను అందుకోలేకపోయారు. పెర్త్ టెస్ట్ మ్యాజిక్‌ను రిపీట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఈ ఓటమితో చెత్త రికార్డును మూటగట్టుకుంది టీమిండియా. భారత్-ఆసీస్ మధ్య ఇప్పటివరకు చాలా టెస్టులు జరిగాయి. అయితే అత్యంత తక్కువ వ్యవధిలో ముగిసిన మ్యాచ్‌గా ఇది నిలిచింది. మూడో రోజు మొదటి సెషన్‌కే మ్యాచ్ అయిపోయింది.
పోరాడకుండానే..
రెండో రోజు ఆఖరుకే భారత్ ఓటమి దాదాపుగా ఖరారైంది. అయితే మూడో రోజు లంచ్ వరకు బ్యాటర్లు పోరాడతారని అంతా అనుకున్నారు. మ్యాచ్ పోతే పోయింది.. ఫైట్ చేస్తే బాగుంటుందని భావించారు. అయితే అది సాధ్యం కాలేదు. మనోళ్లు అలవోకగా చేతులెత్తేశారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో 175 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. మన జట్టు నిర్దేశించిన 19 పరుగుల టార్గెట్‌ను వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించారు కంగారూలు. దీంతో ఇరు దేశాల మధ్య టెస్ట్ క్రికెట్ హిస్టరీలో అత్యంత తక్కువ వ్యవధిలో ముగిసిన మ్యాచ్‌గా నిలిచింది. 171.5 ఓవర్లలోనే ఈ టెస్ట్ ముగియడం గమనార్హం. ఇది టీమిండియా ఫెయిల్యూర్‌కు నిదర్శనమని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. దీని కంటే అవమానం లేదని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read:
పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే..
అదే టీమిండియా కొంపముంచిందా.. ఆసిస్‌తో ఓటమికి 3 కారణాలు
నిలువునా ముంచిన బ్యాటర్లు.. భారత్ ఘోర పరాజయం
For More Sports And Telugu News
Updated Date - Dec 08 , 2024 | 02:47 PM