ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: ఐపీఎల్ ఫార్మాట్, గ్రూప్‌లు ప్రకటన.. ఏ జట్టు ఏ గ్రూప్‌లో ఉందంటే..

ABN, Publish Date - Mar 24 , 2024 | 10:06 PM

ఐపీఎల్ 2024 ఇప్పటికే ప్రారంభమైంది. లీగ్‌లో మొదటి రెండు రోజులు 3 మ్యాచ్‌లు జరిగాయి. అయితే గత సీజన్‌లో 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించి టోర్నీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లోనూ అదే మాదిరిగా నిర్వహిస్తున్న ఇప్పటివరకు ఏ గ్రూపులో ఏ జట్టు ఉందో ప్రకటించలేదు.

ఐపీఎల్ 2024 ఇప్పటికే ప్రారంభమైంది. లీగ్‌లో మొదటి రెండు రోజులు 3 మ్యాచ్‌లు జరిగాయి. అయితే గత సీజన్‌లో 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించి టోర్నీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లోనూ అదే మాదిరిగా నిర్వహిస్తున్న ఇప్పటివరకు ఏ గ్రూపులో ఏ జట్టు ఉందో ప్రకటించలేదు. తాజాగా ఐపీఎల్ నిర్వహకులు ఆ జాబితాను, లీగ్ ఫార్మాట్‌ను ప్రకటించారు. లీగ్ ఫార్మాట్ గతంలో మాదిరిగానే ఉంది. 10 జట్లను గత సీజన్‌లో మాదిరిగానే గ్రూప్ ఏ, గ్రూప్ బీగా విభజించారు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయంతమైన జట్లైనా ముంబై ఇండియన్స్, చెన్నైసూపర్ కింగ్స్ జట్లు వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి. అంతేకాకుండా ఈ రెండు జట్లు లీగ్ దశలో రెండుసార్లు తలపడనున్నాయి. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సీఎస్కే జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈ రెండు జట్లు ఒకే మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఆ ఒక్క మ్యాచ్ ఇప్పటికే ముగిసింది. సన్‌రైజర్స్ గ్రూప్ బీలో ఉంది.


గ్రూప్ ఏ లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నోసూపర్ జెయింట్స్ ఉన్నాయి. గ్రూప్‌ బీ లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఉన్నాయి. ప్రతి జట్టు తమ గ్రూపులోని మిగతా 4 జట్లతో ఒక్కో మ్యాచ్.. వేరే గ్రూపులోని 5 జట్లతో రెండేసి మ్యాచ్‌ల చొప్పున ఆడనుంది. అలా ప్రతి జట్టు 14 మ్యాచ్‌ల చొప్పున ఆడనుంది. మొత్తం లీగ్ దశ పోటీలు ముగిశాక టాప్ 4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్ పోటీలకు అర్హత సాధిస్తాయి. టాప్ 2లో నిలిచిన జట్లు మొదటి క్వాలిఫైయర్‌లో తలపడతాయి. అందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడతాయి. ఓడిన జట్టు లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు రెండో క్వాలిఫైయర్ పోటీకి అర్హత సాధిస్తుంది. మొదటి క్వాలిఫైయర్‌లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2లో పోటీపడతాయి. అక్కడ గెలిచిన ఫైనల్ చేరుతుంది. ఫైనల్లో గెలిచిన జట్టు ట్రోఫీ అందుకుంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 24 , 2024 | 10:06 PM

Advertising
Advertising