ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన ధోని.. జడేజా రికార్డును బద్దలు కొట్టి మరి..

ABN, Publish Date - Apr 09 , 2024 | 03:26 PM

చెన్నైసూపర్ కింగ్స్ సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్‌ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు. సోమవారం కోల్‌కతానైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. 3 బంతుల్లో ఒక పరుగు చేసి అజేయంగా నిలిచాడు.

MS Dhoni All Time Record

చెన్నై: చెన్నైసూపర్ కింగ్స్ (Chennai Super Kings) సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఐపీఎల్‌ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు. సోమవారం కోల్‌కతానైట్ రైడర్స్‌తో (Kolkata Knight Riders) జరిగిన మ్యాచ్‌లో ధోని ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. 3 బంతుల్లో ఒక పరుగు చేసి అజేయంగా నిలిచాడు. ధోని క్రీజులోకి వచ్చే సమయానికే చెన్నై విజయానికి చేరువ కావడంతో ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. దీంతో ఒక పరుగుతో అజేయంగా నిలిచాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో చేజింగ్ సమయంలో అత్యధిక సార్లు నాటౌట్‌గా నిలిచిన బ్యాటర్‌గా ధోని ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు. ధోని అత్యధికంగా 28 సార్లు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 27 సార్లు అజేయంగా నిలిచిన రవీంద్ర జడేజా రికార్డును ధోని బద్దలుకొట్టాడు. ధోని, జడేజా తర్వాత 23 సార్లు అజేయంగా నిలిచిన దినేష్ కార్తీక్ మూడో స్థానంలో, 22 సార్లు అజేయంగా నిలిచిన యూసుఫ్ పఠాన్ నాలుగో స్థానంలో, 22 సార్లు అజేయంగా నిలిచిన డేవిడ్ మిల్లర్ ఐదో స్థానంలో ఉన్నారు.


ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతానైట్ రైడర్స్ 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(34) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే మూడేసి వికెట్లతో చెలరేగారు. ముస్తాఫిజుర్ రహ్మాన్ 2, మహేష్ తీక్షణ ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యాన్ని చెన్నైసూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలోనే చేధించింది. దీంతో కోల్‌కతాపై చెన్నై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 9 ఫోర్లతో 58 బంతుల్లో 67 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఈ సీజన్‌లో చెన్నైకి ఇది మూడో విజయం కాగా.. కోల్‌కతాకు ఇదే తొలి ఓటమి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కోల్‌కతానైట్ రైడర్స్ రెండో స్థానంలో, చెన్నైసూపర్ కింగ్స్ నాలుగో స్థానంలో ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024 Watch: ఈ సీజన్‌లో బెస్ట్ క్యాచ్ ఇదే.. పక్షిలా గాల్లోకి ఎగిరి..

IPL 2024: ముంబై, లక్నో విజయాలతో పాయింట్ల పట్టికలో జరిగిన మార్పులు ఇవే!

Updated Date - Apr 09 , 2024 | 03:43 PM

Advertising
Advertising