ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: వ్యూయర్‌షిప్‌లో చెన్నై vs బెంగళూరు మ్యాచ్ రికార్డు.. గతేడాదితో పోలిస్తే ఏకంగా..

ABN, Publish Date - Mar 23 , 2024 | 06:11 PM

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రారంభమైంది. శుక్రవారం చెన్నైసూపర్ కింగ్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌తో 17వ సీజన్‌కు తెరలేచింది. ఒక వైపున మహేంద్ర సింగ్ ధోని, మరో వైపున విరాట్ కోహ్లీ వంటి పెద్ద ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్‌ను క్రికెట్ ప్రేమికులు పెద్ద సంఖ్యలో వీక్షించారు.

చెన్నై: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రారంభమైంది. శుక్రవారం చెన్నైసూపర్ కింగ్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌తో 17వ సీజన్‌కు తెరలేచింది. ఒక వైపున మహేంద్ర సింగ్ ధోని, మరో వైపున విరాట్ కోహ్లీ వంటి పెద్ద ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్‌ను క్రికెట్ ప్రేమికులు పెద్ద సంఖ్యలో వీక్షించారు. దీంతో వ్యూయర్‌షిప్ పరంగా ఐపీఎల్ 2024 ఆరంభ మ్యాచ్ రికార్డు సృష్టించింది. శుక్రవారం చెన్నై, బెంగళూరు మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్‌ను జియో సినిమాలో ఏకంగా 11.3 కోట్ల మంది వీక్షించారు. గతేడాది జరిగిన ఆరంభ మ్యాచ్‌తో పోలిస్తే ఇది ఏకంగా 51 శాతం అధికం కావడం గమనార్హం. ఆరంభ మ్యాచ్‌నే అభిమానులు భారీగా వీక్షించడంతో ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో మరోసారి రుజువైంది. ఆరంభ మ్యాచ్‌కే ఈ స్థాయిలో వ్యూయర్ షిప్ రావడంతో రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశాలున్నాయి. అదే జరిగితే వ్యూయర్‌షిప్ పరంగా ఈ సారి ఐపీఎల్ కొత్త రికార్డులను నెలకొల్పే అవకాశాలు లేకపోలేదు.


ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఐపీఎల్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్ బోణీ చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై చెన్నైసూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. చెన్నై విజయంలో పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్(4/29) కీలకపాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో సమిష్టిగా రాణించిన చెన్నై బ్యాటర్లు బెంగళూరు విసిరిన 174 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే చేధించారు. దీంతో తమ సొంత మైదానం చెన్నై చెపాక్ స్టేడియంలో బెంగళూరుపై ఉన్న రికార్డును చెన్నై కొనసాగించింది. చెపాక్ స్టేడియంలో బెంగళూరుపై చెన్నై వరుసగా 8వ విజయం నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో అనూజ్ రావత్(48), దినేష్ కార్తీక్ (38), డుప్లెసిస్(35) రాణించారు. అనంతరం లక్ష్యాన్ని చెన్నై 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఆ జట్టు బ్యాటర్లంతా సమిష్టిగా రాణించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 23 , 2024 | 06:11 PM

Advertising
Advertising