ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: ముంబై, లక్నో విజయాలతో పాయింట్ల పట్టికలో జరిగిన మార్పులు ఇవే!

ABN, Publish Date - Apr 08 , 2024 | 03:12 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024) రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లన్నీ క్రికెట్ అభిమానులకు ఫుల్ మాజా పంచాయి. దీంతో రానున్న రోజుల్లో జరిగే మ్యాచ్‌లపై మరింత ఆసక్తి నెలకొంది. ఆదివారం జరిగిన డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లు అభిమానులను అలరించాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024) రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లన్నీ క్రికెట్ అభిమానులకు ఫుల్ మాజా పంచాయి. దీంతో రానున్న రోజుల్లో జరిగే మ్యాచ్‌లపై మరింత ఆసక్తి నెలకొంది. ఆదివారం జరిగిన డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లు అభిమానులను అలరించాయి. సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ (Mumbai Indians vs Delhi Capitals) విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‌లో ముంబై తొలి విజయాన్ని నమోదుచేసింది. రాత్రి జరిగిన మరో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై లక్నోసూపర్ జెయింట్స్(Lucknow Super Giants vs Gujarat Titans) విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్‌ల ఫలితాల అనంతరం ఎప్పటిలాగే ఈ సారి కూడా పాయింట్ల పట్టికలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఢిల్లీపై విజయంతో 10వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి ఎగబాకింది. దీంతో అంతకుముందు 8వ స్థానంలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 9వ స్థానానికి, 9వ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ 10వ స్థానానికి పడిపోయాయి.


ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మూడు జట్ల ఖాతాలో సమానంగా రెండేసి పాయింట్ల చొప్పున ఉన్నప్పటికీ రన్‌రేటులో తేడా కారణంగా పాయింట్ల పట్టికలో వాటి స్థానాలు మారాయి. ఇక గుజరాత్‌ను ఓడించిన లక్నోసూపర్ జెయింట్స్‌ నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. దీంతో అంతకుముందు మూడో స్థానంలో ఉన్న చెన్నైసూపర్ కింగ్స్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు లక్నో 3 విజయాలు సాధించగా.. చెన్నై రెండే గెలిచింది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నోసూపర్ జెయింట్స్ జట్ల ఖాతాల్లో సమానంగా ఆరేసి పాయింట్ల చొప్పున ఉన్నాయి. కానీ మెరుగైన రన్‌రేటు కారణంగా కోల్‌కతా రెండో స్థానంలో, లక్నో మూడో స్థానంలో ఉన్నాయి. ఇక రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల స్థానాల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒకటి కూడా ఓడిపోకుండా అన్ని గెలిచిన రాజస్థాన్ రాయల్స్ 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. రెండేసి విజయాల చొప్పున సాధించిన సన్‌రైజర్స్, పంజాబ్, గుజరాత్.. 5, 6, 7 స్థానాల్లో ఉన్నాయి. లక్నో చేతిలో గుజరాత్ ఓడినప్పటికీ ఆ జట్టు స్థానంలో ఎలాంటి మార్పు జరగలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

MI vs DC: దుమ్ములేపిన ముంబై ఇండియన్స్.. ఢిల్లీపై సూపర్ విక్టరీ

RCB vs RR: చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. డేవిడ్ వార్నర్ రికార్డు బద్దలు

Updated Date - Apr 08 , 2024 | 03:12 PM

Advertising
Advertising