Virat Kohli: విరాట్ కోహ్లీతో ప్రయోగాలు వద్దు.. ముందుంది మొసళ్ల పండగ
ABN , Publish Date - Jun 20 , 2024 | 04:19 PM
టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ స్థానంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న అతను.. ఇంతవరకూ ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా...
టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) స్థానంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న అతను.. ఇంతవరకూ ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఒకదాంట్లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. మరో రెండు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యాడు. ఈ నేపథ్యంలోనే.. కోహ్లీ ఫామ్, స్థానంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మునుపటిలాగా అతను మూడో స్థానంలో (వన్ డౌన్) వస్తేనే బాగుంటుందని అభిమానులతో పాటు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: విమానం గాల్లో ఉండగా షాకింగ్ ప్రమాదం.. చివరికి..
ఈ క్రమంలోనే భారత మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీకి మద్దతు ఇస్తూ.. రోహిత్ శర్మకు (Rohit Sharma) జోడీగా అతను ఓపెనర్‌గా దిగితేనే బాగుంటుందని పేర్కొన్నాడు. కీలక మ్యాచ్‌ల్లో కోహ్లీ తప్పకుండా విజృంభిస్తామని నమ్మకం వెలిబుచ్చాడు. ప్రత్యేకమైన నైపుణ్యాలు కలిగిన కోహ్లీ విషయంలో ప్రయోగాలు అవసరం లేదని సూచించాడు. ‘‘ప్రధాన మ్యాచ్‌ల్లో ఎలా ఆడాలో కోహ్లీకి బాగా తెలుసు. అదే అతనిలో ప్రత్యేకత. సమయం వచ్చినప్పుడు.. అతను కచ్ఛితంగా తన బ్యాట్‌కి పని చెప్తాడు. ఒత్తిడి సమయాల్లోనూ కోహ్లీ ఎంత అద్భుతంగా రాణించాడో మనం ఇదివరకే చూశాం. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌తో సూపర్-8 ప్రారంభం అయ్యింది కాబట్టి.. అసలైన మొసళ్ల పండగ ముందుంది’’ అంటూ చెప్పుకొచ్చాడు.
Read Also: భారత జట్టులో ఊహించని మార్పు.. అతని స్థానంలో..
అమెరికాలో పరిస్థితులు చాలా వేరు అని, విండీస్ పిచ్‌లపై మాత్రం కోహ్లీ కచ్ఛితంగా తన బ్యాట్‌తో మ్యాజిక్ చేస్తాడని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. ఇకపై అసలైన కోహ్లీ ఏంటో అందరూ చూస్తారని ధీమా వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో.. విండీస్ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి, కుల్దీప్ యాదవ్‌ని ఆడిస్తే బాగుంటుందని అన్నాడు. సిరాజ్ స్థానంలో అతడిని తీసుకుంటే ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా బాగా రాణిస్తున్నారు కాబట్టి.. వాళ్లు జట్టులో ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.
Read Latest Sports News and Telugu News