ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bumrah-Labuschagne: లబుషేన్ గాలి తీసేసిన బుమ్రా.. ఇది నెక్స్ట్ లెవల్ స్లెడ్జింగ్

ABN, Publish Date - Dec 06 , 2024 | 05:57 PM

Bumrah-Labuschagne: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా కూల్‌గా, కామ్‌గా ఉంటాడు. ఎవరైనా తనను రెచ్చగొట్టినా తన పనేదో తాను చేసుకుపోతాడు. బంతితోనే ప్రత్యర్థులకు సమాధానం ఇస్తుంటాడు.

IND vs AUS: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా కూల్‌గా, కామ్‌గా ఉంటాడు. ఎవరైనా తనను రెచ్చగొట్టినా తన పనేదో తాను చేసుకుపోతాడు. బంతితోనే ప్రత్యర్థులకు సమాధానం ఇస్తుంటాడు. నోటితో కాకుండా బాల్‌తో అపోజిషన్ బ్యాటర్లకు కౌంటర్ ఇవ్వడం బుమ్రా స్టైల్. స్లెడ్జింగ్ లాంటి వాటికి అతడు చాలా దూరంగా ఉంటాడు. అలాంటోడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను ఆటాడుకున్నాడు. అతడి గాలి తీసేశాడు భారత పేసర్. అసలు ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది? అనేది ఇప్పుడు చూద్దాం..


డెడ్లీ బౌలింగ్

అడిలైడ్ టెస్ట్ ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. బౌలింగ్ చేసేందుకు వచ్చాడు బుమ్రా. అప్పటికే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేసి జోరు మీదున్నాడు పేసుగుర్రం. లబుషేన్‌ను కూడా పెవిలియన్‌ వైపు దారి చూపించాలని డిసైడ్ అయ్యాడు. అందుకే కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. నిఖార్సైన పేస్, పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్, స్వింగింగ్ డెలివరీస్‌తో అతడ్ని భయపెట్టాడు. బుమ్రా నిప్పులు చెరిగే బంతుల్ని కాచుకోలేక లబుషేన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఇదే సమయంలో భారత పేసర్ వేసిన ఓ బాల్‌ను ఆడబోయి మిస్ అయ్యాడు. అంతే బుమ్రా అతడ్ని ఎగతాళి చేశాడు.


ఆటాడుకున్నాడు

లబుషేన్ బంతిని టచ్ చేయకపోవడంతో బుమ్రా అతడి వైపు సరదాగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. చిన్న పిల్లాడి మాదిరి అతడ్ని వెక్కిరించాడు. ఆడు చూద్దామంటూ అతడ్ని కవ్వించాడు. ఆ ఓవర్‌లో లబుషేన్‌ను ఓ ఆటాడుకున్నాడు బుమ్రా. బుల్లెట్ స్పీడ్‌తో వస్తున్న బంతుల్ని ఆడాలో, వదిలేయాలో తెలియక ఆసీస్ బ్యాటర్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అయితే ఎలాగోలా ఆ స్పెల్‌ను తట్టుకొని నిలబడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంగారూలను వణికించావుగా అని దీన్ని చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ప్రస్తుతం ఆసీస్ 1 వికెట్ నష్టానికి 86 పరుగులతో ఉంది. కొత్త కుర్రాడు నాథన్ మెక్‌స్వీనీ (38 నాటౌట్)తో పాటు లబుషేన్ (20 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. లబుషేన్‌ను బుమ్రా వెనక్కి పంపుతాడేమో చూడాలి.


Also Read:

U19 Asia Cup 2024: 13 ఏళ్ల వైభవ్ బ్యాటింగ్ విధ్వంసం.. ఫైనల్స్‌కు టీమిండియా

ఒకేరోజు 12 మంది క్రికెటర్ల బర్త్‌డే.. బుమ్రా, జడ్డూ సహా లిస్ట్‌లోని స్టార్లు వీళ్లే..

సచిన్‌ను గుర్తుచేసిన తెలుగోడు.. సేమ్ టు సేమ్

For More Sports And Telugu News

Updated Date - Dec 06 , 2024 | 06:01 PM