Josh Hazlewood: భారత్‌తో మరింత డేంజర్.. నిద్రపోతున్న సింహాన్ని లేపారు: హేజల్‌వుడ్
ABN, Publish Date - Nov 04 , 2024 | 09:52 PM
Josh Hazlewood: న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అయిన టీమిండియా మీద విమర్శల వాన కురుస్తోంది. అభిమానుల నుంచి క్రిటిక్స్ వరకు అంతా జట్టు ఆటతీరును ఏకిపారేస్తున్నారు. ఈ విషయంపై ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజల్‌వుడ్ రియాక్ట్ అయ్యాడు.
న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అయిన టీమిండియా మీద విమర్శల వాన కురుస్తోంది. అభిమానుల నుంచి క్రిటిక్స్ వరకు అంతా జట్టు ఆటతీరును ఏకిపారేస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి టాప్ ప్లేయర్లు టీమ్‌లో ఉన్నా ఇంత దారుణంగా ఓడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలు జట్టుకు ఏమైందని ఆశ్యర్యపోతున్నారు. ఛాంపియన్ టీమ్ ఇలాగేనా ఆడేది అని క్వశ్చన్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజల్‌వుడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు మద్దతుగా నిలిచిన స్పీడ్‌స్టర్.. నిద్రపోతున్న సింహాన్ని అనవసరంగా లేపారని అన్నాడు. హేజల్‌వుడ్ ఇంకా ఏమన్నాడంటే..
వాళ్ల వల్లే ఓటమి
టీమిండియాను సింహంతో పోల్చిన హేజల్‌వుడ్.. ఆ జట్టును అనవసరంగా మేల్కొల్పారని అన్నాడు. కివీస్ మీద ఓటమితో భారత్ మేల్కొందని.. వాళ్లతో చాలా డేంజర్ అని చెప్పాడు. ఆ టీమ్ మళ్లీ తిరిగొస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆసీస్ పేసర్.. అది ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలన్నాడు. క్వీన్‌స్వీప్ అవడం వల్ల రోహిత్ సేనలో ఆత్మవిశ్వాసం కాస్త సన్నగిల్లే అవకాశాలు ఉన్నాయని తెలిపాడు. కొందరు బ్యాటర్ల వైఫల్యం వల్ల ఈ ఓటమి చోటుచేసుకుందన్నాడు హేజల్‌వుడ్.
అంచనాలకు అందట్లేదు
‘ఒక్క సిరీస్ ఓటమితో టీమిండియాను తక్కువ అంచనా వేయడానికి లేదు. వాళ్లు మళ్లీ తమదైన శైలిలో తిరిగొస్తారు. అది ఎప్పుడో చెప్పలేం. కానీ మనం తప్పక చూస్తాం. 0-3 తేడాతో ఓడారు. రేపు 3-0తో మరో సిరీస్ గెలవొచ్చు. ఏదైనా సాధ్యమే కదా. ఈ ఓటమి గురించి మరీ ఎక్కువ ఆలోచించడం సరికాదు’ అని హేజల్‌వుడ్ చెప్పుకొచ్చాడు. భారత్‌తో త్వరలో సిరీస్ ఉంది కాబట్టి ఆ జట్టు కివీస్ చేతుల్లో ఓడిపోవడం తమకు లాభిస్తుందన్నాడు. ఆ విషయంలో న్యూజిలాండ్‌కు థ్యాంక్స్ చెప్పక తప్పదన్నాడు. కానీ భారత్‌ను నిద్రలేపారని.. ఇక మీదట ఆ టీమ్ ఎలా ఆడుతుందో అంచనాలకు కూడా అందట్లేదన్నాడు.
Also Read:
వీడియో: కమిన్స్ ముందు పాక్ ప్లేయర్ పిల్లిమొగ్గలు.. నెక్స్ట్ బాల్‌కే..
టీమిండియాను వదలని శాపం.. ఇంకెన్ని దారుణాలు చూడాలో..
గంభీర్‌కు బీసీసీఐ గుబులు.. తప్పించుకోవడానికి నో ఛాన్స్
For More Sports And Telugu News
Updated Date - Nov 04 , 2024 | 09:56 PM