IPL 2024: ఐపీఎల్‌లో ఆ రోజు జరగాల్సిన బిగ్ మ్యాచ్‌పై నీలి నీడలు.. ఎందుకంటే..
ABN, Publish Date - Apr 01 , 2024 | 03:53 PM
ఈ సారి ఐపీఎల్ షెడ్యూల్, వేదికల విషయంలో బీసీసీఐ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని సమస్యలు తప్పేలా లేవు. సార్వత్రిక ఎన్నికల దృష్యా ఐపీఎల్ షెడ్యూల్‌ను బీసీసీఐ రెండు విడతల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 22 నుంచి ప్రారంభమైన లీగ్ మొదటి విడతలో 21 మ్యాచ్‌లకు బీసీసీఐ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఈ సారి ఐపీఎల్ (IPL) షెడ్యూల్, వేదికల విషయంలో బీసీసీఐ(BCCI) ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని సమస్యలు తప్పేలా లేవు. సార్వత్రిక ఎన్నికల దృష్యా ఐపీఎల్ షెడ్యూల్‌ను బీసీసీఐ రెండు విడతల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 22 నుంచి ప్రారంభమైన లీగ్ మొదటి విడతలో 21 మ్యాచ్‌లకు బీసీసీఐ షెడ్యూల్‌ను విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత మిగతా షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇక ఐపీఎల్‌కు ఎలాంటి ఆటంకం ఉండదని, అంతా సవ్యంగా జరుగుతుందని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు ఏకంగా ఓ మ్యాచ్ జరగడంపై సందిగ్ధం నెలకొంది. ఐపీఎల్ 2024లో భాగంగా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 17న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ (Kolkata Knight Riders vs Rajasthan Royals) జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.
కానీ అదే రోజున శ్రీరామ నవమి(Sri Rama Navami) ఉత్సవాలతోపాటు లోక్‌సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. మ్యాచ్ జరిగే కోల్‌కతాలో రామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. కాబట్టి భారీగా పోలీస్ భద్రతను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదే రోజు మ్యాచ్ కూడా ఉండడంతో సరైన పోలీస్ భద్రతను కల్పించడం సాధ్యం కాదేమోనని బీసీసీఐ భావిస్తోంది. దీంతో ఏప్రిల్ 17న జరగాల్సిన కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ మేరకు ప్రముఖ క్రీడా వైబ్‌సైట్ క్రిక్ బజ్ తమ కథనంలో పేర్కొంది.
IPL 2024: మైలురాయిని చేరుకున్న ఆర్సీబీ.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో జట్టుగా..
క్రిక్ బజ్ కథనం ప్రకారం.. మ్యాచ్ వేదిక మార్చడం లేదా రీషెడ్యూల్ చేసి మ్యాచ్‌ను మరో రోజుకు వాయిదా వేయడంపై బీసీసీఐ ఆలోచిస్తోంది. అయితే ఈ విషయాన్ని ముందుగానే రెండు జట్ల ఫ్రాంచైజీలతోపాటు బ్రాడ్‌కాస్టర్లకు బోర్డు తెలియచేసింది. మరోవైపు భద్రత విషయమై కోల్‌కతా పోలీసులతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ చర్చలు జరుపుతోంది. మ్యాచ్ నిర్వహణ అంశంపై బీసీసీఐ ఇంకా తుది నిర్ణయాలని రాలేదు. అయితే త్వరలోనే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఇక ఈ సీజన్‌లో కోల్‌కతా, రాజస్థాన్ ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కోల్‌కతా మొదటి స్థానంలో ఉండగా.. రాజస్థాన్ మూడో స్థానంలో ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
IPL 2024: గంభీర్-కోహ్లీకి ఆస్కార్ ఇవ్వాలి.. దిగ్గజ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు
IPL 2024: ముంబైతో మ్యాచ్‌లో చరిత్ర సృష్టించనున్న అశ్విన్.. ఆ రికార్డు సాధించిన తొలి బౌలర్‌గా..
Updated Date - Apr 01 , 2024 | 03:53 PM