Labuschagne-Siraj: లబుషేన్-సిరాజ్ ఫైట్.. కంగారూ బ్యాటర్‌పై మియా సీరియస్
ABN, Publish Date - Dec 06 , 2024 | 06:40 PM
Labuschagne-Siraj: టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ తనను ఎవరైనా గెలికితే అస్సలు ఊరుకోడు. దెబ్బకు దెబ్బ తీసేంత వరకు వారిని వదిలిపెట్టడు. స్లెడ్జింగే కాదు.. అవసరమైతే ఫైటింగ్‌కు కూడా సై అంటాడు.
IND vs AUS: టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ తనను ఎవరైనా గెలికితే అస్సలు ఊరుకోడు. దెబ్బకు దెబ్బ తీసేంత వరకు వారిని వదిలిపెట్టడు. స్లెడ్జింగే కాదు.. అవసరమైతే ఫైటింగ్‌కు కూడా సై అంటాడు. అందుకే అతడి జోలికి ఎవరూ వెళ్లరు. మియాతో గొడవకు దిగితే రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రత్యర్థి జట్లకు తెలుసు. అతడ్ని రెచ్చగొడితే చెలరేగి బౌలింగ్ చేస్తాడని, అది తమకే నష్టం కలిగిస్తుందని తెలుసు కాబట్టే సిరాజ్‌కు దూరంగా ఉంటారు. అలాంటి డేంజరస్ భారత స్పీడ్‌స్టర్‌తో కంగారూ బ్యాటర్ మార్నస్ లబుషేన్ ఫైట్‌కు దిగాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
బుమ్రా వదిలితే.. సిరాజ్ అందుకున్నాడు
అడిలైడ్ టెస్ట్‌లో అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ చుట్టూనే ఇవి జరుగుతున్నాయి. ఆల్రెడీ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో రాంగ్ షాట్ ఆడి స్లెడ్జింగ్‌కు గురయ్యాడు లబుషేన్. ఆడు చూద్దామంటూ అతడ్ని బుమ్రా ఆటపట్టించాడు. చూపించు నీ తడాఖా అంటూ వెక్కిరించాడు. ఆ తర్వాత సిరాజ్ కూడా లబుషేన్‌ను వదల్లేదు. మియా ఓవర్‌లో లబుషేన్ బ్యాటింగ్ చేస్తుండగా.. హఠాత్తుగా సైట్ స్క్రీన్ పక్క నుంచి ఓ వ్యక్తి నడుచుకుంటూ పోయాడు. అతడి చేతిలో ఏదో పొడవాటి పైపు లాంటి వస్తువు కనిపించింది.
స్ట్రాంగ్ రిప్లయ్
సైట్ స్క్రీన్ పక్క నుంచి వ్యక్తి నడుచుకుంటూ పోవడంతో లబుషేన్ డిస్ట్రబ్ అయ్యాడు. దీంతో బంతి విసిరేందుకు పరిగెత్తుకుంటూ వస్తున్న సిరాజ్‌ను ఆపాడు. అయితే అప్పటికే దాదాపుగా యాక్షన్ పూర్తి చేసిన హైదరాబాదీ పేసర్ అసహనానికి లోనయ్యాడు. రనప్ ఆపేసి లబుషేన్ వైపు దూసుకెళ్లాడు. కోపంలో కీపర్ వైపు బంతిని గట్టిగా విసిరాడు. అది కాస్తా లబుషేన్ పక్క నుంచి వెళ్లింది. దీంతో సైట్ స్క్రీన్ సమస్య వల్లే ఆడలేదని కంగారూ బ్యాటర్ చెప్పాడు. పైకి ఎందుకు వస్తున్నావంటూ సిరాజ్‌ను గెలికాడు. ఏం చేస్తావ్.. తప్పు నీదే అన్నట్లు టీమిండియా పేసర్ అతడికి స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చాడు. ఓవరాక్షన్ చేయకంటూ అతడి వైపు సీరియస్‌గా చూశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read:
లబుషేన్ గాలి తీసేసిన బుమ్రా.. ఇది నెక్స్ట్ లెవల్ స్లెడ్జింగ్
U19 Asia Cup 2024: 13 ఏళ్ల వైభవ్ బ్యాటింగ్ విధ్వంసం.. ఫైనల్స్‌కు టీమిండియా
ఒకేరోజు 12 మంది క్రికెటర్ల బర్త్‌డే.. బుమ్రా, జడ్డూ సహా లిస్ట్‌లోని స్టార్లు వీళ్లే..
For More Sports And Telugu News
Updated Date - Dec 06 , 2024 | 06:45 PM