Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఆ తప్పు కారణంగా..
ABN, Publish Date - Apr 20 , 2024 | 07:00 AM
అసలే రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినందుకు హార్దిక్ పాండ్యాపై తారాస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు.. పెర్ఫార్మెన్స్ చెత్తగా ఉండటంతో అభిమానులతో పాటు సీనియర్లు, మాజీలు సైతం పెదవి విరుస్తున్నారు.
అసలే రోహిత్ శర్మ (Rohit Sharma) స్థానంలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినందుకు హార్దిక్ పాండ్యాపై (Hardik Pandya) తారాస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు.. పెర్ఫార్మెన్స్ చెత్తగా ఉండటంతో అభిమానులతో పాటు సీనియర్లు, మాజీలు సైతం పెదవి విరుస్తున్నారు. కెప్టెన్‌గా జట్టుని సమర్థవంతంగా నడిపించడం లేదని, ఆటగాడిగానూ తనదైన ముద్ర చూపించలేకపోతున్నాడని అతడ్ని తిట్టిపోస్తున్నారు. ఇది చాలదన్నట్టు.. పాండ్యాకు తాజాగా పెద్ద షాక్ తగిలింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అతనికి రూ.12 లక్షల జరిమానా విధించింది. ఇందుకు కారణం.. స్లో ఓవర్‌రేట్.
అవన్నీ పచ్చి అబద్ధాలు అంటూ క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ
గురువారం మల్లన్‌పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు నిర్ణీత సమయంలో తన 20 ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది. నిర్దేశించిన సమయం కన్నా ఎక్కువ టైం తీసుకుంది. దీంతో.. స్లో ఓవర్‌రేట్ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పాండ్యాపై రూ.12 లక్షల పెనాల్టీ విధించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ స్లో ఓవర్‌రేట్ కారణంగా.. రిషభ్ పంత్ (2 సార్లు), శుబ్‌మన్ గిల్, సంజూ సామ్సన్, శ్రేయస్ అయ్యర్‌లపై జరిమానా విధించడం జరిగింది.
బుమ్రా వేసిన సూపర్ యార్కర్ చూశారా? ఆ బాల్ ఆడడం ఎవరికైనా కష్టమే..
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (78) అర్థశతకంతో చెలరేగడంతో పాటు రోహిత్ శర్మ (36), తిలక్ వర్మ (34) మెరుపులు మెరిపించడంతో.. ముంబై జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేధనలో భాగంగా.. పంజాబ్ జట్టు 19.3 ఓవర్లలో 183 పరుగులకి ఆలౌట్ అయ్యి ఓటమిపాలైంది. తమ జట్టుని గెలిపించుకోవడం కోసం ఆశుతోష్ శర్మ (61), శశాంక్ సింగ్ (41) గట్టిగానే ప్రయత్నించారు కానీ, చివరికి వారి కృషి వృధా అయ్యింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 20 , 2024 | 07:00 AM