ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: ముంబైతో మ్యాచ్‌లో చరిత్ర సృష్టించనున్న అశ్విన్.. ఆ రికార్డు సాధించిన బౌలర్‌గా..

ABN, Publish Date - Apr 01 , 2024 | 03:02 PM

ఐపీఎల్ 2024లో సోమవారం కీలక పోరు జరగనుంది. ఐదు సార్ల ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో మొదటి సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.

ముంబై: ఐపీఎల్ 2024లో(IPL 2024) సోమవారం కీలక పోరు జరగనుంది. ఐదు సార్ల ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో మొదటి సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్ (Mumbai Indians vs Rajasthan Royals)తలపడనుంది. వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ పోరుతో ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తొలిసారి తమ హోంగ్రౌండ్‌లో మ్యాచ్ ఆడనుండగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలిసారి తమ హౌంగ్రౌండ్ కాకుండా ఇతర జట్ల మైదానంలో ఆడనుంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో గెలవగా.. ముంబై ఆడిన రెండింటిలో ఓడిపోయింది. ఈ సీజన్‌లో ఇంకా ఒక్క విజయం కూడా నమోదు చేయని జట్టు ముంబై ఇండియన్స్ మాత్రమే. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి బోణీ చేయాలని భావిస్తోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిస్టే పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి వెళ్లనుంది.

IPL 2024: సన్‌రైజర్స్‌కు భారీ దెబ్బ.. టోర్నీ మొత్తానికి స్టార్ ఆటగాడు దూరం


అయితే ఈ మ్యాచ్ ఆడడం ద్వారా రాజస్థాన్ రాయల్స్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwi) చరిత్ర సృష్టించనున్నాడు. 37 ఏళ్ల అశ్విన్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 199 మ్యాచ్‌లు ఆడాడు. ముంబైతో మ్యాచ్ ఆడడం ద్వారా 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకోనున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో 200 మ్యాచ్‌లు ఆడిన మొదటి బౌలర్‌గా అశ్విన్ చరిత్ర సృష్టించనున్నాడు. అశ్విన్ కంటే ముందు రవీంద్ర జడేజా కూడా 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. కానీ జడ్డూ మొదటి నుంచి ఆల్‌రౌండర్‌గా ఆడుతున్నాడు. కాబట్టి బౌలర్ల పరంగా చూసుకుంటే మొదటిసారిగా అశ్వినే ఈ ఘనత సాధించినవాడు అవుతాడు. మొత్తంగా 10వ ఆటగాడిగా నిలవనున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో మహేంద్ర సింగ్ ధోని మొదటి స్థానంలో ఉన్నాడు. ధోని ఇప్పటివరకు 253 మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాతి స్థానాల్లో దినేష్ కార్తీక్(245), రోహిత్ శర్మ(245), విరాట్ కోహ్లీ(240), రవీంద్ర జడేజా(229), శిఖర్ ధావన్(220), సురేష్ రైనా(205), రాబిన ఊతప్ప(205), అంబటి రాయుడు(204), రవిచంద్రన్ అశ్విన్(199) ఉన్నారు.

ఇక ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 199 మ్యాచ్‌లాడిన అశ్విన్ 28 సగటుతో 172 వికెట్లు తీశాడు. ఎకానమీ 7గా ఉంది. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 4/34గా ఉన్నాయి. బ్యాటింగ్‌లో 13 సగటు, 119 స్ట్రైక్ రేటుతో 743 పరుగులు చేశాడు. ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది. పలు మార్లు బ్యాటింగ్‌లోనూ అశ్విన్ మెరిశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024: మైలురాయిని చేరుకున్న ఆర్సీబీ.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో జట్టుగా..

IPL 2024: గంభీర్-కోహ్లీకి ఆస్కార్ ఇవ్వాలి.. దిగ్గజ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Apr 01 , 2024 | 03:15 PM

Advertising
Advertising