Virat Kohli: కయ్యానికి కాలు దువ్వుతున్న కోహ్లీ.. పక్కా ప్లానింగ్‌తోనే ముందుకు..
ABN, Publish Date - Nov 20 , 2024 | 06:03 PM
Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని గెలకాలంటే అందరూ వణుకుతారు. అతడితో పెట్టుకుంటే తమ పరిస్థితి ఏం అవుతుందో ప్రత్యర్థులకు బాగా తెలుసు. అందుకే కింగ్ జోలికి ఎవ్వరూ వెళ్లరు.
IND vs AUS: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని గెలకాలంటే అందరూ వణుకుతారు. అతడితో పెట్టుకుంటే తమ పరిస్థితి ఏం అవుతుందో ప్రత్యర్థులకు బాగా తెలుసు. అందుకే కింగ్ జోలికి ఎవ్వరూ వెళ్లరు. కానీ ఆస్ట్రేలియా టీమ్ అలా కాదు. స్లెడ్జింగ్‌కు పెట్టింది పేరైన కంగారూలు గతంలో పలుమార్లు విరాట్‌ను రెచ్చగొట్టారు. అతడు భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు స్లెడ్జింగ్ అస్త్రాన్ని ప్రయోగించారు. మాటలతో కవ్వించేందుకు ప్రయత్నించారు. అయితే దూకుడు తత్వం ఉన్న విరాట్.. వాళ్ల ఆయుధాన్ని వాళ్ల మీదకే రివర్స్ చేశాడు. మరింత అటాకింగ్ గేమ్ ఆడుతూ ఆసీస్ ప్లాన్‌ను తుత్తునియలు చేశాడు. అప్పటి నుంచి విరాట్‌తో స్లెడ్జింగ్ అంటే ఆ జట్టు ఆటగాళ్లు వణుకుతారు. అయితే ఈసారి మాత్రం కాస్త భిన్నంగా జరగబోతోందని అంటున్నాడో ఆసీస్ లెజెండ్.
అస్సలు ఊరుకోడు
ఆస్ట్రేలియా ఆటగాళ్లతో కోహ్లీ కయ్యానికి కాలు దువ్వుతున్నాడని మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్ అన్నాడు. స్లెడ్జింగ్ అంటే విరాట్‌కు చాలా ఇష్టమన్న కంగారూ లెజెండ్.. ఆసీస్ ఆటగాళ్లు అతడ్ని రెచ్చగొట్టే తప్పు మాత్రం చేయొద్దన్నాడు. కింగ్‌ను గెలికితే ప్రమాదం తప్పదని.. చూస్తుండగానే రిజల్ట్‌ను తారుమారు చేస్తాడని హెచ్చరించాడు. కోహ్లీని స్లెడ్జింగ్ చేయొద్దని సూచించాడు. అయితే భారత స్టార్ మాత్రం స్లెడ్జింగ్‌ను కోరుకుంటాడని తెలిపాడు. తనలోని బెస్ట్ బయటకు తీసుకొచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది, మరింత పట్టుదలతో ఆడేందుకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో కోహ్లీ కొట్లాటకు సై అంటాడని క్లార్క్ స్పష్టం చేశాడు.
ఆ ఛాన్స్ ఇవ్వొద్దు
‘ఆస్ట్రేలియా ఆటగాళ్లు కోహ్లీని స్లెడ్జ్ చేస్తారని అనుకోవడం లేదు. ఒకవేళ ఆ తప్పు గనుక చేస్తే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. విరాట్ మాత్రం స్లెడ్జింగ్‌నే కోరుకుంటాడు. తనతో ప్రత్యర్థులు గొడవపడాలనేది అతడి ప్లాన్. ఎవరైనా గెలికితే సీరియస్‌గా తీసుకొని తనలోని బెస్ట్ బయటకు తీసుకొస్తాడు. కాబట్టి ఆసీస్ ప్లేయర్లు అతడికి ఆ అవకాశం ఇవ్వకూడదు. ఇది వాళ్లకు కూడా తెలుసు’ అని క్లార్క్ వ్యాఖ్యానించాడు. విరాట్‌ను ఆసీస్ ప్రజలు బాగా ఇష్టపడతారని అతడు చెప్పుకొచ్చాడు. ఒకవేళ భారత్ గనుక సిరీస్ గెలవాలంటే కోహ్లీ పరుగుల వరద కురిపించక తప్పదని.. అతడి ఆటతీరును బట్టే సిరీస్ డిసైడ్ అవుతుందని పేర్కొన్నాడు.
Also Read:
హార్దిక్ పాండ్యాకు ఘోర అవమానం.. పగబట్టి మరీ చేశారుగా
ఆసీస్‌తో టీమిండియా ఫైట్.. ఫ్రీగా స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే
దూసుకొచ్చిన తిలక్ వర్మ.. సూర్యకుమార్ స్థానానికి ఎసరు పెట్టిన యంగ్ ప్లేయర్
For More Sports And Telugu News
Updated Date - Nov 20 , 2024 | 06:07 PM