Mitchell Starc: ప్రతీకారం తీర్చుకున్న స్టార్క్.. చెప్పి మరీ కొట్టాడుగా..
ABN, Publish Date - Dec 06 , 2024 | 01:04 PM
Mitchell Starc: ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ తనను గెలికితే ఎలా ఉంటుందో చూపించాడు. భారత బ్యాటర్లపై అతడు ప్రతీకారం తీర్చుకున్నాడు. చెప్పి మరీ కొట్టాడీ స్పీడ్‌స్టర్.
IND vs AUS: ఆస్ట్రేలియా వెటరన్ పేసర్ మిచెల్ స్టార్క్ ప్రతీకారం తీర్చుకున్నాడు. చెప్పి మరీ టీమిండియాను దెబ్బతీశాడు. పెర్త్ టెస్ట్‌లో తనకు జరిగిన అవమానానికి అతడు అంతకంతా భారత్‌ను చావుదెబ్బ తీశాడు. అతడి కారణంగా అడిలైడ్ టెస్ట్‌లో 81 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది రోహిత్ సేన. తొలి టెస్ట్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ (0) గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (37) క్రీజులో సెటిల్ అయ్యాక వికెట్ పారేసుకున్నాడు. ఇంజ్యురీ తర్వాత కమ్‌బ్యాక్ ఇస్తున్న శుబ్‌మన్ గిల్ (31) కూడా క్రీజులో పాతుకున్నాక పెవిలియన్ చేరాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (7) నిరాశపర్చాడు. అయితే మన బ్యాటర్ల ఫెయిల్యూర్ కంటే కూడా స్టార్క్ ప్రతీకారేచ్ఛే భారత్ పుట్టి ముంచిందని చెప్పొచ్చు. రివేంజ్ తీసుకోవాలన్న కసితో అతడు బౌలింగ్ చేసిన తీరు హైలైట్‌గా నిలిచింది.
దెబ్బతిన్న స్టార్క్ అహం
గేమ్ ఛేంజర్ అయిన మిచెల్ స్టార్క్‌తో పెట్టుకోవాలంటే మహా మహా బ్యాటర్లు కూడా భయపడుతుంటారు. దీనికి కారణం అతడి లీథల్ పేస్, స్వింగింగ్ డెలివరీసే. ఒక లెంగ్త్ పట్టుకొని బౌలింగ్ చేస్తూ పోయే స్టార్క్.. బాల్‌ను ఇరువైపులా స్వింగ్ చేస్తూ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడతాడు. ఒకవేళ వికెట్ నుంచి బౌన్స్ గానీ లభిస్తే అతడ్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. అలాంటోడు ఇంక హోమ్ కండీషన్స్‌లో ఎంతగా చెలరేగి బౌలింగ్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఆసీస్‌తో వాళ్ల సొంతగడ్డపై మ్యాచ్ అంటే తోపు బ్యాటర్లు కూడా భయపడతారు. స్టార్క్‌ను ఎదుర్కొనేందుకు వెనుకాడతారు. అయితే టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రం అతడితో ఢీ అంటే ఢీ అంటూ తలపడ్డాడు. దీంతో స్టార్క్ అహం దెబ్బతింది.
వార్ షురూ..
పెర్త్ టెస్ట్‌లో స్టార్క్- జైస్వాల్ మధ్య బ్యాటిల్ హైలైట్‌గా నిలిచింది. స్టార్క్ బౌలింగ్‌లో భారత యంగ్‌స్టర్ భారీ షాట్లు కొట్టాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సులతో సీనియర్ పేసర్‌ను భయపెట్టాడు. అంతేగాక అతడి కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ స్లెడ్జింగ్ కూడా చేశాడు. ఫాస్ట్ బౌలర్ అంటారు.. నీ బాల్ బ్యాట్ వద్దకు ఇంత స్లోగా వస్తోందేంటి? అంటూ స్టార్క్‌ను రెచ్చగొట్టాడు జైస్వాల్. దీంతో నీ పని తర్వాత చూసుకుంటా.. అనేలా ఆసీస్ పేసర్ సీరియస్‌గా చూశాడు. ఆ మ్యాచ్‌తో మొదలైన వీరి మధ్య యుద్ధం అడిలైడ్‌లోనూ కంటిన్యూ అయింది. పింక్ బాల్ టెస్ట్‌లో జైస్వాల్‌తో పాటు రాహుల్, కోహ్లీని స్టార్క్ బలిగొన్నాడు. అతడు ఫుల్లర్ లెంగ్త్‌లో విసిరిన బంతి గాల్లో సుడులు తిరుగుతూ వచ్చి జైస్వాల్ ప్యాడ్స్‌ను తాకడంతో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత అదే జోరులో కేఎల్, కోహ్లీని ఔట్ చేశాడు స్టార్క్. దీంతో జైస్వాల్ తప్పు చేశాడని.. అనవసరంగా సీనియర్ పేసర్‌తో పెట్టుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read:
కేఎల్ రాహుల్ చేసిన పనికి.. క్షణాల్లో ఆవిరైన ఆస్ట్రేలియా ఆనందం.. వీడియో
భారీ ఎదురుదెబ్బ.. కీలక వికెట్ సమర్పించుకున్న టీమిండియా
హైబ్రిడ్ మోడల్‌లో చాంపియన్స్ ట్రోఫీ?
For More Sports And Telugu News
Updated Date - Dec 06 , 2024 | 01:04 PM