Ravichandran Ashwin: హెల్మెట్‌లో కెమెరాతో బ్యాటింగ్.. అశ్విన్ మామూలోడు కాదు
ABN, Publish Date - Dec 22 , 2024 | 01:12 PM
Ravichandran Ashwin: ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, పొలిటికల్ లీడర్స్, ఫిల్మ్ స్టార్స్.. ఇలా అందరూ అతడ్ని మెచ్చుకుంటున్నారు. అతడి సేవల్ని గుర్తుచేసుకుంటున్నారు. ఈ తరుణంలోనే అశ్విన్ తెలివిని కూడా మెచ్చుకుంటున్నారు.
ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, పొలిటికల్ లీడర్స్, ఫిల్మ్ స్టార్స్.. ఇలా అందరూ అతడ్ని మెచ్చుకుంటున్నారు. దేశానికి అతడు అందించిన సేవల్ని గుర్తుచేసుకుంటున్నారు. ఆఫ్ స్పిన్, క్యారమ్ బాల్స్‌తో బ్యాటర్లను అతడు భయపెట్టిన తీరును మెచ్చుకుంటున్నారు. మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా అశ్విన్‌ను ప్రశంసించాడు. అయితే గ్రేట్ క్రికెట్ బ్రెయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ స్పిన్నర్ తెలివిని కైఫ్ మెచ్చుకున్నాడు. ఈ సందర్భంగా అశ్విన్‌తో జరిగిన ఓ సంభాషణను షేర్ చేసుకున్నాడు. హెల్మెట్‌లో కెమెరా పెట్టుకొని బ్యాటింగ్ చేసిన ఘటన గురించి కైఫ్ పంచుకున్నాడు.
డేంజర్ స్కెచ్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ప్లాన్స్‌ను అశ్విన్ ఎలా తిప్పికొట్టాడో కైఫ్ షేర్ చేశాడు. ఐపీఎల్-2021లో అశ్విన్-స్మిత్ కలసి ఒకే జట్టుకు ఆడారు. ఇద్దరూ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అదరగొట్టారు. అయితే ఆ సీజన్ ప్రాక్టీస్ సెషన్స్ సమయంలో స్మిత్ తన హెల్మెట్‌లో కెమెరా పెట్టుకొని బ్యాటింగ్‌కు వచ్చేవాడట. అశ్విన్ బౌలింగ్ తీరును రికార్డు చేసుకోవాలని స్కెచ్ వేశాడట. ఆ వీడియోను అనలైజ్ చేసి టీ20 ప్రపంచ కప్-2021లో అశ్విన్ బౌలింగ్‌లో దుమ్మురేపాలని వ్యూహం పన్నాడట. అయితే దాన్ని ముందే పసిగట్టిన భారత్ స్పిన్నర్.. డీసీ కోచింగ్ స్టాఫ్‌లో ఒకడైన కైఫ్ చెప్పినా స్మిత్‌కు మాత్రం అతడు బౌలింగ్ చేయలేదట.
పసిగట్టాడు
‘అశ్విన్‌తో కలసి ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో పనిచేశా. ఐపీఎల్-2021 సమయంలో అతడు స్టీవ్ స్మిత్‌కు బౌలింగ్ చేయలేదు. స్మిత్ ఢిల్లీ టీమ్‌లోనే ఉన్నాడు. అతడు నెట్ ప్రాక్టీస్‌కు వచ్చినప్పుడు బౌలింగ్ చేయమని అశ్విన్‌ను కోరా. కానీ దానికి అతడు నిరాకరించాడు. దీంతో ఏమైందని అడిగితే.. అతడు చెప్పింది విని షాకయ్యా. స్మిత్ తన హెల్మెట్‌లో కెమెరా పెట్టుకొని వచ్చాడని అశ్విన్ అన్నాడు. అతడు తన బౌలింగ్ తీరును రికార్డు చేసుకుందామని వచ్చాడని చెప్పాడు. అప్పటివరకు స్మిత్ కెమెరాను నేను పసిగట్టలేదు. కానీ అశ్విన్ కనిపెట్టేశాడు. అతడి అనాలసిస్, ముందుచూపునకు ఫిదా అయ్యా’ అని కైఫ్ వ్యాఖ్యానించాడు.
Also Read:
అశ్విన్.. అదొక్కటి మర్చిపోకు.. స్టార్ స్పిన్నర్‌కు ప్రధాని సజెషన్
చాంపియన్‌గా టీమిండియా.. అమ్మాయిలు కప్పు కొట్టేశారు..
సీఎస్‌కే చిచ్చరపిడుగు విధ్వంసం.. 97 బంతుల్లోనే డబుల్ సెంచరీ
రిటైరైనా ఫిట్‌నెస్‌లో బాప్.. ఈ బ్యాటింగ్ రాక్షసుడ్ని గుర్తుపట్టారా..
For More Sports And Telugu News
Updated Date - Dec 22 , 2024 | 01:18 PM