Rohit-Kohli: రోహిత్-కోహ్లీకి కైఫ్ వార్నింగ్.. కట్ చేయాలంటూ..
ABN, Publish Date - Nov 06 , 2024 | 02:56 PM
Rohit-Kohli: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మీద విమర్శల పరంపర కొనసాగుతోంది. న్యూజిలాండ్ సిరీస్‌లో వాళ్లు ఆడిన తీరు మీద సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ నడుస్తోంది. సీనియర్ క్రికెటర్లు కూడా స్టార్లపై విరుచుకుపడుతున్నారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మీద విమర్శల పరంపర కొనసాగుతోంది. న్యూజిలాండ్ సిరీస్‌లో వాళ్లు ఆడిన తీరు మీద సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ నడుస్తోంది. సీనియర్ క్రికెటర్లు కూడా స్టార్లపై విరుచుకుపడుతున్నారు. వాళ్ల వైఫల్యం వల్లే టీమ్‌కు ఈ గతి పట్టిందని.. వైట్‌వాష్ అవడానికి వాళ్లే కారణమని అంటున్నారు. ఇద్దరిలో కనీసం ఒక్కరైనా బాధ్యత తీసుకొని ఆడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెబుతున్నారు. ఈ తరుణంలో వెటరన్ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్-కోహ్లీకి మాస్ వార్నింగ్ ఇచ్చిన మాజీ బ్యాటర్.. వాళ్లకు ఆ సేవలు కట్ చేయాల్సిందేనన్నాడు. కైఫ్ ఇంకా ఏమన్నాడంటే..
దేశవాళీల్లో ఆడించాలి
రోహిత్-కోహ్లీ విలాసవంతమైన జీవితాన్ని పక్కనబెట్టి చెమటోడ్చాలని కైఫ్ అన్నాడు. బడా బడా కార్లు, విమానాల్లో తిరగడం కంటే.. టీమ్ ప్రయోజనాలే ముఖ్యంగా ముందుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాడు. వాళ్లు ఇంక వీఐపీ సేవలు మర్చిపోవాల్సిందేనన్నాడు. రోహిత్-కోహ్లీ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నందున వాళ్లను తప్పకుండా డొమెస్టిక్ క్రికెట్‌లో ఆడించాలని కైఫ్ సూచించాడు. ఈ మేరకు బీసీసీఐ చర్యలు తీసుకోవాలని తెలిపాడు. ఈ ఇద్దరు స్టార్లు ఒక్కసారి ఫామ్‌లోకి వచ్చారంటే ఆపడం కష్టమని అభిప్రాయపడ్డాడు.
పంత్ మ్యాజిక్ చేయాలి
త్వరలో జరగబోయే ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గురించి కూడా కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ పర్యటనలో కీపర్ రిషబ్ పంత్ టీమిండియాకు చాలా కీలకం కానున్నాడని కైఫ్ చెప్పుకొచ్చాడు. గబ్బా టెస్ట్‌లో అతడు ఆడిన విన్నింగ్ నాక్ ఇంకా కళ్ల ముందు కదలాడుతోందని మెచ్చుకున్నాడు కైఫ్. ఆ టూర్‌తో కొత్త పంత్‌ను చూశానని.. ఈసారి కూడా అతడు అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు.
Also Read:
IPL Auction: ఐపీఎల్ వేలంలో పేర్లు నమోదు చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్ ఇదే
వామప్ మ్యాచ్ రద్దు సరికాదు
విరాట్‌కు విషెస్ చెబుతావా?
For More Sports And Telugu News
Updated Date - Nov 06 , 2024 | 03:16 PM