ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MS Dhoni: స్టార్టప్ దశ మార్చేసిన ధోని.. చిన్న సాయంతో వేల కోట్లు

ABN, Publish Date - Nov 11 , 2024 | 09:26 AM

ధోని ఏది ముట్టుకున్నా బంగారమేనని మరోసారు ప్రూవ్ అయింది. ఒక్క పనితో ఓ స్టార్టప్ దశ మార్చేశాడు మాహీ. చిన్న సాయంతో ఆ సంస్థకు వేల కోట్లు వచ్చి పడేలా చేశాడు.

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి చాన్నాళ్లే అవుతోంది. అయినా అతడి ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. పైగా ఏటికేడు తన పాపులారిటీని మరింత పెంచుకుంటూ పోతున్నాడు. ఒక్క ఐపీఎల్‌లో మాత్రమే బ్యాట్ పట్టి బరిలోకి దిగే మాహీ.. మిగతా ఏడాదంతా యాడ్స్, బిజినెస్ వ్యవహారాలు, ఫామ్‌హౌస్‌లో వ్యవసాయం చేస్తూ బిజీగా ఉంటాడు. ఐపీఎల్, అడ్వర్టయిజ్‌మెంట్స్ ద్వారానే కాదు.. పలు వ్యాపార సంస్థల్లో భాగస్వామ్యం, చిన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా తన ఆదాయాన్ని అతడు డబుల్ చేసుకుంటున్నాడు. అలాంటోడు ఏది ముట్టుకున్నా బంగారమేనని మరోమారు ప్రూవ్ అయింది.


వేల కోట్ల సామ్రాజ్యంగా..

ఒక చిన్న సాయంతో పెద్దగా ఎవరికీ తెలియని ఓ స్టార్టప్ కంపెనీకి వేల కోట్ల టర్నోవర్ వచ్చి పడేలా చేశాడు ధోని. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఖాతాబుక్ అనే స్టార్టప్ సంస్థకు మొదటి నుంచి అండగా ఉంటున్నాడు టీమిండియా లెజెండ్. ఆశిష్ సోనోన్, ధనేష్ కుమార్, వైభవ్ కల్పే, జైదీప్ పూనియా, రవీష్ నరేష్‌లు కలసి 2018లో ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. ఆన్‌లైన్ పేమెంట్స్‌కు సంబంధించిన ఈ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టాడు మాహీ. అతడి నమ్మకం వమ్ము కాలేదు. గత ఏడాది ఆ కంపెనీ వ్యాల్యుయేషన్ ఏకంగా రూ.4,500 కోట్లకు చేరింది.


నమ్మకమే గెలిచింది

ఖాతాబుక్‌లో పెట్టుబడులు పెట్టడమే గాక టీమ్‌తో ఎప్పటికప్పుడు సపోర్టివ్‌గా ఉంటూ వచ్చాడట ధోని. అతడి నమ్మకం, సంస్థకు అతడు ఇచ్చిన భరోసా, వెనుక నుంచి నడిపించడం వృథా కాలేదు. ఆ కంపెనీ తక్కువ టైమ్‌‌లోనే వేల కోట్ల సంస్థగా ఆవిర్భవించింది. దీంతో మాహీ ఏది పట్టుకున్నా బంగారమేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ధోని అనే కాదు.. ఈ మధ్య కాలంలో చాలా మంది సెలెబ్రిటీలు చిన్న చిన్న అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే వాటిల్లో కొన్ని మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. ఇక, మరో ఐపీఎల్ ఆడేందుకు ధోని సిద్ధమైపోయాడు. ఇటీవల రిటెన్షన్ ప్రక్రియ సమయంలో అతడ్ని రూ.4 కోట్లు పెట్టి అట్టిపెట్టుకుంది చెన్నై సూపర్ కింగ్స్.


Also Read:

రెండో టీ20లో టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు

మెక్‌స్వీని, ఇన్‌గ్లిస్‌లకు పిలుపు

ఉత్కంఠ పోరులో ముంబా గెలుపు

For More Sports And Telugu News

Updated Date - Nov 11 , 2024 | 09:28 AM