ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో ఎంఎస్ ధోనీ వైల్డ్ కార్డ్ ఏంట్రి..?

ABN, Publish Date - Apr 24 , 2024 | 07:03 PM

గత సీజన్లతో పోలిస్తే.. ఈ ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. చివరి ఓవర్లలో వచ్చి.. కాసేపు మెరుపులు మెరిపించి వెళ్లిపోతున్నాడు. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరుసార్లు బ్యాటింగ్‌కి వచ్చిన ధోనీ..

గత సీజన్లతో పోలిస్తే.. ఈ ఐపీఎల్-2024లో (IPL 2024) చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. చివరి ఓవర్లలో వచ్చి.. కాసేపు మెరుపులు మెరిపించి వెళ్లిపోతున్నాడు. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరుసార్లు బ్యాటింగ్‌కి వచ్చిన ధోనీ.. ఒక్కసారి కూడా ఔట్ అవ్వలేదు. మొత్తం 35 బంతులు ఎదుర్కొన్న అతను.. 260 స్ట్రైక్‌రేట్‌తో 9 ఫోర్లు, 14 సిక్సుల సహకారంతో 91 పరుగులు సాధించాడు. ఇలా ధోనీ మంచి ఫామ్‌లో ఉండటంతో.. టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టులో అతడిని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకోవాలని అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సిఫార్సు చేస్తున్నారు.


ఎలాన్ మస్క్ మరో సంచలనం.. యూట్యూబ్‌కి పోటీగా ‘ఎక్స్ టీవీ యాప్’

ఈ అంశంపై ఓ క్రీడా ఛానల్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (Aaron Finch) మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే టీ20 వరల్డ్‌కప్ కోసం ఇండియా స్వ్కాడ్‌లో మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీ చూడొచ్చని, అదే ఎంఎస్ ధోనీ అని పేర్కొన్నాడు. ఒకవేళ ధోనీ రీఎంట్రీ ఇస్తే.. అప్పుడది ‘ది వైల్డెస్ట్ కార్డ్’ అవుతుందని అభివర్ణించాడు. భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాడు. తాను ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ ఆడాలని అనుకుంటున్నానని ధోనీ చెప్తే.. ఈ అవకాశాన్ని ఎవ్వరూ తిరస్కరించరని చెప్పాడు. ధోనీ రీఎంట్రీతో ఎవరికీ ఎలాంటి సమస్య లేదని, ఏ ఒక్కరూ అభ్యంతరాలు వ్యక్తం చేయరని, ఎందుకంటే అతడు ఈ ఐపీఎల్ సీజన్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. స్టార్ స్పోర్ట్స్ చాట్‌లో భాగంగా.. వీళ్లిద్దరూ (ఫించ్, పఠాన్) ఇలా తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.

టీ20 వరల్డ్ కప్ జట్టులో ఆ ఇద్దరికీ నో ప్లేస్.. ఈ 15 మంది సెట్!

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా క్రిక్‌బజ్‌లో ధోనీ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీ స్ట్రైక్‌రేట్ 250 కంటే ఎక్కువగా ఉందని.. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఔట్ అవ్వలేదు కాబట్టి ‘సగటు’ కూడా లేదని నొక్కి చెప్పాడు. ధోనీకి మించిన వికెట్ కీపర్ బ్యాటర్ లేడని కొనియాడాడు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ధోనీని టీ20 వరల్డ్‌కప్ కోసం ఒప్పించడం చాలా కష్టమేనని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కుండబద్దలు కొట్టాడు. ధోనీ అమెరికాకు వస్తాడు కానీ.. క్రికెట్ ఆడేందుకు కాదని, గోల్ఫ్ ఆడటం కోసమని పేర్కొన్నాడు. ఈ సంగతి పక్కన పెడితే.. మాజీలు, ఫ్యాన్స్ చెప్తున్నట్టు ధోనీ ‘వైల్డ్ కార్డ్’ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? చూస్తుంటే.. అది దాదాపు అసాధ్యమేనని అనిపిస్తోంది.

Read Latest Sports News and Telugu News

Updated Date - Apr 24 , 2024 | 07:03 PM

Advertising
Advertising