SRH vs MI: ఇక్కడ బౌలింగ్ చేయడం కష్టం.. వారు మాత్రం అదరగొట్టారు: హార్దిక్
ABN, Publish Date - Mar 28 , 2024 | 08:40 AM
ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. బౌలర్లు నామమాత్రంగా మారిన ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.
హైదరాబాద్: ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. బౌలర్లు నామమాత్రంగా మారిన ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ట్రావిస్ హెడ్(62), అభిషేక్ శర్మ(63), క్లాసెన్(80), మాక్రమ్(42) ఊచకోతతో ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధికంగా 277/3 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం కొండంత లక్ష్య చేధనలో ముంబై ఇండియన్స్ కూడా బాగానే పోరాడింది. నిర్ణీత 20 ఓవర్లలో 246/5 పరుగులు చేసింది. దీంతో పరుగుల తుఫాన్ కురిసిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 31 పరుగుల తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇంత భారీ స్కోర్ చేస్తుందని ఊహించలేదని తెలిపాడు. పిచ్ బ్యాటింగ్‌కు ఇంతలా అనుకూలిస్తుందని అంచనా వేయలేకపోయామని చెప్పాడు. ముందే ఊహించి ఉంటే బ్యాటింగ్ ఎంచుకునే వాడినని అన్నాడు.
‘‘సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 277 పరుగుల భారీ స్కోర్ సాధిస్తుందని ఊహించలేదు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించింది. పిచ్ బౌలింగ్ చేయడానికి కష్టంగా ఉన్నప్పటికీ మా బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారు. వారు 277 పరుగులు చేశారంటే ఆ జట్టు బ్యాటర్లు బాగా ఆడారని అర్థం. రెండు జట్లు కలిసి 500కు పైగా పరుగులు చేశాయంటే పిచ్ బ్యాటింగ్‌కు ఎంతలా అనుకూలించిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ మేం కొంచెం భిన్నంగా ప్రయత్నించాల్సింది. కానీ మాది యంగ్ బౌలింగ్ అటాక్. ఈ ఓటమి నుంచి మేము గుణపాఠం నేర్చుకుంటాం. బంతి చాలాసార్లు ప్రేక్షకుల్లోకి వెళ్తే ఓవర్లు పూర్తి చేయడానికి మాకు సమయం కావాలి. బ్యాటర్లు ప్రతి ఒక్కరూ బాగా ఆడారు. క్వేనా మఫాకా మంచి బౌలర్. కానీ అతని మొదటి గేమ్‌లో తేలిపోయాడు. అతను మంచి బౌలర్. అతనికి మద్దతుగా నిలుస్తాం.’’ అని అన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
SRH vs MI: ఉప్పల్‌లో రికార్డుల ఊచకోత.. సన్‌రైజర్స్ vs ముంబై మ్యాచ్‌లో బద్దలైన రికార్డులివే!
Updated Date - Mar 28 , 2024 | 08:40 AM