Mumbai Indians: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ఆ ఘనత సాధించిన తొలి జట్టు
ABN, Publish Date - Apr 08 , 2024 | 08:14 AM
వండర్స్ క్రియేట్ చేయడంలో ఎప్పుడూ ముందుండే ముంబై ఇండియన్స్ జట్టు తాజాగా ఓ చారిత్రాత్మక రికార్డ్‌ని నమోదు చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలో (ఐపీఎల్, సీఎల్‌టీ20తో కలిపి) 150 విజయాలు సాధించిన మొట్టమొదటి జట్టుగా సంచలన రికార్డ్‌ని సృష్టించింది.
వండర్స్ క్రియేట్ చేయడంలో ఎప్పుడూ ముందుండే ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు తాజాగా ఓ చారిత్రాత్మక రికార్డ్‌ని నమోదు చేసింది. టీ20 క్రికెట్ (T20 Cricket) చరిత్రలో (ఐపీఎల్, సీఎల్‌టీ20తో కలిపి) 150 విజయాలు సాధించిన మొట్టమొదటి జట్టుగా సంచలన రికార్డ్‌ని సృష్టించింది. ఏప్రిల్ 7వ తేదీన వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై (Delhi Capitals) సాధించిన విజయంతో.. ముంబై జట్టు ఈ ఘనతని తన ఖాతాలో వేసుకుంది. ముంబై తర్వాత 148 విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) రెండో స్థానంలో ఉంది. అంటే.. ఈ టోర్నమెంట్‌లోనే ఆ జట్టు కూడా 150 విజయాల మైలురాయిని అందుకోనుంది.
మొజాంబిక్ తీరంలో విషాదం.. బోటు మునిగి 91 మంది మృతి
టీ20 క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్లు
* 150 - ముంబై ఇండియన్స్ (273 మ్యాచ్‌లలో)
* 148 - చెన్నై సూపర్ కింగ్స్ (253 మ్యాచ్‌లలో)
* 144 - ఇండియా (223 మ్యాచ్‌లలో)
* 143 - లాంక్షైర్ (248 మ్యాచ్‌లలో)
* 143 - నాటింగ్‌హామ్‌షైర్ (244 మ్యాచ్‌లలో)
విజయానికి ఒక్క అడుగు దూరంలోనే.. అప్పటిదాకా తగ్గేదేలేదన్న ఇజ్రాయెల్ ప్రధాని
ఇక ముంబై, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (49), ఇషాన్ కిషన్ (42), టిమ్ డేవిడ్ (45), షెఫర్డ్ (39) ఊచకోత కోయడం వల్లే ముంబై అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేధనలో భాగంగా ఢిల్లీ (205/8) గట్టిగానే పోరాడింది కానీ ఫలితం లేకుండా పోయింది. పృథ్వీ షా (66), అభిషేక్ (41), స్టబ్స్ (71) అద్దిరిపోయే ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా.. స్టబ్స్ మైదానంలో పెను విధ్వంసమే సృష్టించాడు. కానీ.. ఇతర బ్యాటర్ల నుంచి తగిన సహకారం అందకపోవడంతో ఢిల్లీ జట్టు 205 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 08 , 2024 | 09:05 AM