Nitish Kumar Reddy: కన్నీళ్లు ఆపుకోలేకపోయిన నితీష్ రెడ్డి తల్లి.. కొడుకు బ్యాటింగ్ చూసి..
ABN, Publish Date - Dec 28 , 2024 | 01:48 PM
IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్ అనూహ్య మలుపులు తిరుగుతోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ డే3 ఎండింగ్‌కు వచ్చేసరికి మ్యాచ్‌లో టీమిండియా పట్టు బిగించింది. ఓడిపోని స్థితికి చేరుకున్న మెన్ ఇన్ బ్లూ.. ఇంకా ఫైట్ చేస్తే విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదంతా ఆ ఇద్దరి వల్లే సాధ్యమైంది.
Boxing Day Test: బాక్సింగ్ డే టెస్ట్ అనూహ్య మలుపులు తిరుగుతోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ డే3 ఎండింగ్‌కు వచ్చేసరికి మ్యాచ్‌లో టీమిండియా పట్టు బిగించింది. ఓడిపోని స్థితికి చేరుకున్న మెన్ ఇన్ బ్లూ.. ఇంకా ఫైట్ చేస్తే విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదంతా ఆ ఇద్దరి వల్లే సాధ్యమైంది. అందులో ఒకరు స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (50) అయితే.. మరొకరు తెలుగు బిడ్డ నితీష్ కుమార్ రెడ్డి. ఈ ఇద్దరూ అద్భుతమైన పార్ట్‌నర్‌షిప్‌తో మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశారు. ఓడిపోయే స్థితి నుంచి టీమిండియాను బయటపడేశారు. ముఖ్యంగా నితీష్ (105 నాటౌట్) సూపర్బ్ బ్యాటింగ్‌తో అందరి మనసులు గెలుచుకున్నాడు. స్టన్నింగ్ సెంచరీతో కంగారూలకు పోయించాడు. అతడి ఇన్నింగ్స్ చూసి అభిమానులు సంబురాలు చేసుకుంటే.. పేరెంట్స్ ఫుల్ ఎమోషనల్ అయిపోయారు.
ఏడ్చేశారు
నితీష్ రెడ్డి మెయిడిన్ సెంచరీ పూర్తి కాగానే మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ విజిల్స్, క్లాప్స్‌తో దద్దరిల్లింది. నితీష్.. నితీష్ అంటూ స్టేడియంలోని భారత అభిమానులు గట్టిగా అరుస్తూ అతడ్ని అభినందించారు. ఆసీస్ ఫ్యాన్స్ కూడా స్టాండింగ్ ఒవేషన్‌తో అతడికి గౌరవం ఇచ్చారు. ఇది చూసి నితీష్ తల్లిదండ్రులు ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. అతడి తండ్రి ఆనందం తట్టుకోలేక గ్రౌండ్‌లో ఏడ్చేశాడు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతున్న సమయంలో నితీష్ తల్లి కన్నీళ్లు పెట్టేసుకున్నారు. కొడుకు సెంచరీ సాధించిన సంతోషం ఉన్నా.. అతడు ఈ స్థాయికి చేరుకునే క్రమంలో పడిన కష్టాలు, బాధలు గుర్తుకుతెచ్చుకొని ఆమె ఏడ్చేశారు. కన్నీళ్లను ఆపుకుంటూ చిరునవ్వులు చిందించారు. కొడుకు సాధించిన ఘనతపై ఆనందంతో పాటు గర్వంగా ఉందన్నారామె.
ఫుల్ ఎమోషనల్
నితీష్ తల్లితో పాటు అతడి తండ్రి, సోదరి మాట్లాడిన వీడియోలు.. సెంచరీపై భావోద్వేగానికి గురైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి ఎవరి అండదండలు లేకుండా ఈ స్థాయికి చేరడం అంటే మామూలు విషయం కాదని మెచ్చుకుంటున్నారు. నితీష్ టాలెంట్, అతడి పట్టుదలతో పాటు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటూ ఎన్నో త్యాగాలు చేసిన ఫ్యామిలీపై ప్రశంసల వర్షం కురుస్తున్నారు. నితీష్ బలం అతడి కుటుంబమేనని.. వారి అండ వల్లే అతడు ఇక్కడికి వరకు వచ్చాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అతడి ఇదే ఆటతీరును కొనసాగిస్తూ ఫ్యూచర్‌లో మరిన్ని బ్యూటిఫుల్ ఇన్నింగ్స్‌లు ఆడాలని.. దేశానికి ఇలాగే సేవలు అందించాలని కోరుకుంటున్నారు.
Also Read:
బాష్ ప్రపంచ రికార్డు
అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డి.. పుష్ప స్టైల్లో సంబరాలు
సెమీస్‌కు లక్ష్యసేన్
For More Sports And Telugu News
Updated Date - Dec 28 , 2024 | 05:32 PM