Ravichandran Ashwin: రిటైర్మెంట్‌పై ట్విస్ట్ ఇచ్చిన అశ్విన్.. ఇలా అనేశాడేంటి
ABN, Publish Date - Dec 19 , 2024 | 10:23 AM
భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆటకు అల్విదా చెప్పేశాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. అయితే పోతూ పోతూ భలే ట్విస్ట్ ఇచ్చాడు.
IND vs AUS: భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌కు అల్విదా చెప్పేశాడు. జెంటిల్మన్ గేమ్ నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం అధికారిక ప్రకటన చేశాడు. గబ్బా టెస్ట్ ముగిశాక నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సారథి రోహిత్ శర్మతో కలసి అశ్విన్ పాల్గొన్నాడు. అందులోనే తన రిటైర్మెంట్ గురించి అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ హృదయాలు ఒక్కసారిగా ముక్కలయ్యాయి. మాజీ క్రికెటర్లు కూడా ఇంకా ఆడే సత్తా ఉన్నప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో రిటైర్మెంట్‌పై అశ్విన్ ట్విస్ట్ ఇచ్చాడు.
గర్వంగా ఉంది
రిటైర్మెంట్‌పై ప్రకటన తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాడు అశ్విన్. అక్కడ భారత ఆటగాళ్లతో పాటు ఆసీస్ కెప్టెన్ కమిన్స్, స్పిన్నర్ నాథన్ లియోన్‌ను కలిశాడు. ఆ తర్వాత ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. ఇన్నాళ్లూ దేశానికి ఆడటం గర్వంగా ఉందన్నాడు. ప్రతి ఆటగాడికీ ఒక సమయం వస్తుందని.. తాను వెళ్లిపోవాల్సిన టైమ్ వచ్చేసిందన్నాడు. జట్టు సభ్యులతో గత కొన్నేళ్లలో సూపర్బ్ బాండింగ్ ఏర్పడిందన్నాడు. అయితే అలా మాట్లాడుతూనే రిటైర్మెంట్‌పై ట్విస్ట్ ఇచ్చాడు. తనలోని ఇంటర్నేషనల్ క్రికెటర్‌కు ఇది ముగింపు కావొచ్చు.. కానీ తనలోని క్రికెట్ మాత్రం ఎప్పటికీ క్లోజ్ అవ్వదన్నాడు.
క్రికెట్‌కు దూరమవను
క్రికెట్ నుంచి తనను దూరంగా ఉంచలేరని.. అది అసాధ్యమని అశ్విన్ చెప్పాడు. ఆటకు తాను దూరంగా ఉండలేనన్నాడు. టీమిండియా ప్లేయర్లు రాబోయే మ్యాచుల్లో, సిరీస్‌ల్లో ఎలా ఆడతారనేది గమనిస్తూ ఉంటానని స్పష్టం చేశాడు. కాగా, అశ్విన్ రిటైర్మెంట్‌పై ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. అతడు మరిన్ని సంవత్సరాలు ఆడాలని.. అప్పుడే పక్కకు జరగడం కరెక్ట్ కాదని అంటున్నారు. రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. డోన్ట్ గో.. కమ్‌బ్యాక్ అశ్విన్ అని కోరుతున్నారు. రెండు టెస్టుల్లో ఫెయిలైనంత మాత్రాన గేమ్‌కు గుడ్‌బై చెప్పడం సరికాదని.. అతడిలో ఎంతో క్రికెట్ ఇంకా మిగిలే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ తరుణంలో క్రికెట్ నుంచి తనను దూరం చేయలేరంటూ అశ్విన్ అనడం ఆసక్తికరంగా మారింది. అతడు మళ్లీ కమ్‌బ్యాక్ ఇస్తాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read:
అశ్విన్‌కు కమిన్స్ స్పెషల్ గిఫ్ట్.. మనసులు గెలిచిన ఆసీస్ కెప్టెన్
రిటైర్మెంట్‌కిదా సమయం: సన్నీ
నాడు ధోనీ.. నేడు అశ్విన్
For More Sports And Telugu News
Updated Date - Dec 19 , 2024 | 10:29 AM