RCB vs RR: చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. డేవిడ్ వార్నర్ రికార్డు బద్దలు
ABN, Publish Date - Apr 06 , 2024 | 08:30 PM
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కొట్టిన ఫోర్ల ద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.
జైపూర్: ఐపీఎల్ 2024లో (IPL 2024) భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Rajasthan Royals vs Royal Challengers Bengaluru) బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat kohli) చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కొట్టిన ఫోర్ల ద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్ (David Warner) రికార్డును కోహ్లీ బద్దలుకొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో వార్నర్ ఇప్పటివరకు 662 ఫోర్లు బాదాడు. రాజస్థాన్‌తో మ్యాచ్ ముందు వరకు కోహ్లీ 660 ఫోర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో బర్గర్ వేసిన రెండో ఓవర్లో 2 ఫోర్లు బాదిన కోహ్లీ.. వార్నర్ రికార్డును సమం చేశాడు. బౌల్ట్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో మరో ఫోర్ బాదిన కోహ్లీ.. వార్నర్ రికార్డును బద్దలుకొట్టాడు. మొత్తంగా ఈ జాబితాలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శిఖర్ ధావన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ధావన్ 766 ఫోర్లు బాదాడు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (562), సురేష్ రైనా( 506), గౌతం గంభీర్ (492), రాబిన్ ఊతప్ప (481), అజింక్య రహానే (462) ఉన్నారు.
అలాగే ఈ మ్యాచ్‌లో చేసిన రన్స్ ద్వారా ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ 7,500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో 7,500 పరుగులు చేసిన మొట్ట మొదటి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 242 మ్యాచ్‌లాడిన కోహ్లీ 38 సగటుతో 7,500కు పైగా పరుగులు చేశాడు. ఇందులో 53 హాఫ్ సెంచరీలు, 7 సెంచరీలు ఉన్నాయి. అలాగే ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో ఇప్పటివరకు అత్యధికంగా121 పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా కోహ్లీ నిలిచాడు. ఈ క్రమంలో 105 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ను అధిగమించాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాప్ డుప్లిపెస్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్ 100+ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో పవర్‌ప్లేలో ఆర్సీబీ 53 పరుగులు చేసింది. 12 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్సీసీ స్కోర్ 107/0గా ఉంది. క్రీజులో కోహ్లీ(59), డుప్లిసెస్(40) ఉన్నారు.
తుది జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సౌరవ్ చౌహాన్, రీస్ టోప్లీ, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్
రాజస్థాన్ రాయల్స్: యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్ కీపర్/కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, నాంద్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
SRH vs CSK: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. సీఎస్కే ఓడిపోయిందని ఏకంగా..
SRH vs CSK: ధోని క్రీజులోకి రాకుండా కమిన్స్ వ్యూహం పన్నాడా..? అందుకే రివ్యూకు వెళ్లలేదా..?
Updated Date - Apr 06 , 2024 | 08:36 PM