RCBW vs DCW: చెలరేగిన ఢిల్లీ బ్యాటర్లు.. బెంగళూరు ముందు భారీ లక్ష్యం
ABN, Publish Date - Feb 29 , 2024 | 09:50 PM
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉమెన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ బ్యాటర్లు చెలరేగారు. దీంతో బెంగళూరు ముందు ఢిల్లీ 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ జట్టులో షఫాలీ వర్మ(50), అలిస్ కాప్సే(46), జెస్ జోనాస్సెస్(36*), మారిజానే కాప్(32) చెలరేగారు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉమెన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ బ్యాటర్లు చెలరేగారు. దీంతో బెంగళూరు ముందు ఢిల్లీ 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ జట్టులో షఫాలీ వర్మ(50), అలిస్ కాప్సే(46), జెస్ జోనాస్సెస్(36*), మారిజానే కాప్(32) చెలరేగారు. 28 పరుగులకే కెప్టెన్ లాన్నింగ్(11) వికెట్ కోల్పోయినప్పటికీ ఆ తర్వాత మరో ఓపెనర్ షఫాలీ వర్మ, అలిస్ కాప్సే దుమ్ములేపారు. ధాటిగా బ్యాటింగ్ చేసిన వీరిద్దరు రెండో వికెట్‌కు 43 బంతుల్లోనే 82 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఓపెనర్ షఫాలీ వర్మ హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసింది. అయితే ఈ భాగస్వామ్యాన్ని 12వ ఓవర్‌లో శ్రేయాంక పాటిల్ విడదీసింది. 4 సిక్సులు, 3 ఫోర్లతో 31 బంతుల్లోనే 50 పరుగులు చేసిన షఫాలీ వర్మను ఔట్ చేసింది.
అయితే ఆ వెంటనే జెమీమా రోడ్రిగ్స్ డకౌట్ అయింది. 4 ఫోర్లు, 2 సిక్సులతో 33 బంతుల్లో 46 పరుగులు చేసిన అలిస్ కాప్సేను నాడిన్ డి క్లర్క్ పెవిలియన్ చేర్చింది. దీంతో 124 పరుగులకు ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో డెత్ ఓవర్లలో మిడిలార్డర్ బ్యాటర్లు జోనాస్సెన్, మారిజానే కాప్ విధ్వంసం సృష్టించారు. వేగంగా బ్యాటింగ్ చేసిన వీరిద్దరు 21 బంతుల్లోనే 48 పరుగులు జోడించారు. అయితే 2 ఫోర్లు, 3 సిక్సులతో 16 బంతుల్లోనే 32 పరుగులు చేసిన మారిజానేను డివైన్ ఔట్ చేసింది. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ జట్టు 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. 4 ఫోర్లు, 2 సిక్సులతో 16 బంతుల్లోనే 36 పరుగులు చేసిన జోనాస్సెస్ నాటౌట్‌గా నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 29 , 2024 | 09:50 PM