ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

T20 World Cup: తొలి బ్యాచ్‌తో వెళ్లని హార్దిక్, కోహ్లీ, శాంసన్.. అసలు కారణాలు ఇవే!

ABN, Publish Date - May 26 , 2024 | 06:13 PM

టీ20 వరల్డ్ కప్ 2024 కోసం శనివారం భారత ఆటగాళ్ల తొలి బ్యాచ్ అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ ఆటగాళ్లందరూ అక్కడికి చేరుకున్నారు. కానీ..

టీ20 వరల్డ్ కప్ 2024 (T20 World Cup 2024) కోసం శనివారం భారత ఆటగాళ్ల తొలి బ్యాచ్ అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మతో (Rohit Sharma) పాటు యువ ఆటగాళ్లందరూ అక్కడికి చేరుకున్నారు. కానీ.. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya), సంజూ శాంసన్ (Sanju Samson) మాత్రం వారితో కలిసి వెళ్లలేదు. ఇందుకు విభిన్న కారణాలు ఉన్నాయి. అవేంటంటే..


విరాట్ కోహ్లీ

ఈ ఐపీఎల్ సీజన్‌లో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీ కొంత విరామం తీసుకోవాలని నిర్ణయించాడు. ఈ విషయాన్ని బీసీసీఐకి ముందుగానే తెలియజేశాడు. అందుకే.. కోహ్లీ వీసాకు సంబంధించిన పేపర్ వర్క్‌కి బీసీసీఐ వాయిదా వేసినట్లు తెలిసింది. క్రీడా వర్గాల రిపోర్ట్స్ ప్రకారం.. కోహ్లీ మే 30వ తేదీన అమెరికాకు వెళ్లే అవకాశం ఉంది. “తాను జట్టులో ఆలస్యంగా చేరుతానని కోహ్లీ మాకు ముందుగానే తెలియజేశాడు. అతని అభ్యర్థనని బీసీసీఐ అంగీకరించింది. అందుకే.. వీసా అపాయింట్‌మెంట్‌ను తరువాత తేదీకి మార్చింది. కోహ్లీ మే 30 తెల్లవారుజామున న్యూయార్క్‌కు చేరుకోవచ్చు’’ అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

హార్దిక్ పాండ్యా

ప్రస్తుతం తనకున్న వ్యక్తిగత సమస్యల కారణంగా.. హార్దిక్ పాండ్యా లండన్‌కు వెళ్లాడు. తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో అతను విడాకులు తీసుకుంటున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి టైంలో పాండ్యా లండన్‌కు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. జర్నలిస్ట్ విమల్ కుమార్ తన యూట్యూబ్ ఛానెల్‌లో హార్దిక్ పాండ్యా లండన్‌లో ఉన్నారని చెప్పారు. అతను త్వరలోనే అమెరికాకు వెళ్లి, టీమిండియా జట్టుతో చేరుతాడని పేర్కొన్నారు. తాను కూడా ఆలస్యంగా వస్తానని బీసీసీఐకి ముందే ఇన్ఫామ్ చేశాడని, అతని అభ్యర్థనని సైతం బోర్డు అనుమతించిందని తెలిసింది.

సంజూ శాంసన్

నిజానికి.. తొలి బ్యాచ్‌తోనే కలిసి సంజూ శాంసన్ అమెరికాకు వెళ్లాల్సింది. కానీ.. దుబాయ్‌లో అతని వ్యక్తిగత పని పెండింగ్‌లో పడిపోయింది. దీంతో.. అది పూర్తి చేసుకొని తాను అమెరికాకి వస్తానని బోర్డుకు తెలియజేశాడు. అయితే.. అతను ఎప్పుడు యూఎస్‌కు వెళ్తాడన్నది క్లారిటీ లేదు. బహుశా మే 27వ తేదీన బయలుదేరే రెండో బ్యాచ్‌తో కలిసి సంజూ వెళ్లే అవకాశం ఉంది.

Read Latest Sports News and Telugu News

Updated Date - May 26 , 2024 | 06:13 PM

Advertising
Advertising