World Cup: టీ20 వరల్డ్ కప్ జట్టులో రిషబ్ పంత్?
ABN, Publish Date - Apr 09 , 2024 | 08:06 PM
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ రీఎంట్రీలో సత్తా చాటుతున్నాడు. 2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ 15 నెలలపాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. పూర్తిగా కోలుకుని ఐపీఎల్ 2024 ద్వారానే రీఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా సత్తా చాటుతున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) రీఎంట్రీలో సత్తా చాటుతున్నాడు. 2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ 15 నెలలపాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. పూర్తిగా కోలుకుని ఐపీఎల్ 2024 (IPL 2024) ద్వారానే రీఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా సత్తా చాటుతున్నాడు. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 30 సగటుతో 153 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 154 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండడం, అన్ని విభాగాల్లో సత్తా చాటుతుండడంతో త్వరలో టీ20 ప్రపంచకప్‌నకు ఎంపిక చేయబోయే భారత జట్టులో రిషబ్ పంత్‌కు చోటు దక్కనుందని సమాచారం. జూన్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్‌కు వికెట్ కీపర్‌గా పంత్‌ను ఎంపిక చేయడానికే సెలెక్టర్లు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది.
కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, ధృవ్ జురేల్ కూడా రేసులో ఉన్నప్పటికీ పంత్‌ను ఎంపిక చేయడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రముఖ క్రీడా వెబ్ సైట్ క్రిక్ బజ్ తమ కథనంలో పేర్కొంది. దానికి కారణాలు కూడా లేకపోలేదు. టీ20ల్లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ నిదానంగా ఉండడం, పలు కారణాలతో ఇషాన్ కిషన్ బీసీసీఐ కాంట్రాక్టు కోల్పోవడం, దీనికి తోడు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో కిషన్ అంతగా రాణించలేకపోతున్నాడు. ఇక ధృవ్ జురేల్‌కు పెదగా అనుభవం లేదు. దీంతో పంత్‌ను ఎంపిక చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా ఈ నెల చివర్లో లేదా మే మొదటి వారంలో టీమిండియా ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
IPL 2024 Watch: ఈ సీజన్‌లో బెస్ట్ క్యాచ్ ఇదే.. పక్షిలా గాల్లోకి ఎగిరి..
IPL 2024: ఐపీఎల్‌లో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన ధోని.. జడేజా రికార్డును బద్దలు కొట్టి మరి..
Updated Date - Apr 09 , 2024 | 08:09 PM