Rishabh Pant: స్టార్లంతా ఫెయిలైనా పంత్ అదరగొట్టాడు.. అతడి సీక్రెట్ ఏంటి
ABN, Publish Date - Nov 02 , 2024 | 02:27 PM
Rishabh Pant: ముంబై టెస్ట్‌లో భారత్-న్యూజిలాండ్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇరు జట్లు నువ్వానేనా అంటూ తలపడుతుండటంతో ఎవరిది పైచేయో చెప్పలేని పరిస్థితి. అయితే రేసులో కాస్త వెనుకబడిన టీమిండియాను మళ్లీ పుంజుకునేలా చేసింది మాత్రం రిషబ్ పంత్ అనే చెప్పాలి.
IND vs NZ: ముంబై టెస్ట్‌లో భారత్-న్యూజిలాండ్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇరు జట్లు నువ్వానేనా అంటూ తలపడుతుండటంతో ఎవరిది పైచేయో చెప్పలేని పరిస్థితి. అయితే రేసులో కాస్త వెనుకబడిన టీమిండియాను మళ్లీ పుంజుకునేలా చేసింది మాత్రం రిషబ్ పంత్ అనే చెప్పాలి. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఒకదశలో 84 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత్. కెప్టెన్ రోహిత్ శర్మ, యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా పెవిలియన్‌కు చేరుకున్నాడు. మరో ఒకట్రెండు వికెట్లు పడితే మ్యాచ్ పూర్తిగా కివీస్ చేతుల్లోకి వెళ్లిపోయేది. ఈ సమయంలో తుఫాన్ బ్యాటింగ్‌తో చెలరేగాడు పంత్ (59 బంతుల్లో 60). భారీ షాట్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. శుబ్‌మన్ గిల్ (146 బంతుల్లో 90) అండతో జట్టును గట్టెక్కించాడు. అయితే రోహిత్, కోహ్లీ సహా న్యూజిలాండ్ బ్యాటర్లు కూడా అగ్రెసివ్‌గా ఆడేందుకు భయపడిన చోట పంత్ ధనాధన్ ఇన్నింగ్స్ ఎలా ఆడాడని అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఫియర్‌లెస్ అప్రోచ్
స్టార్లంతా విఫలమైనా పంత్ ఎలా థండర్ ఇన్నింగ్స్ ఆడాడని షాకవుతున్నారు ఫ్యాన్స్. బాల్ బాగా టర్న్ అవుతుండటం, ఒక్కోసారి అనూహ్యంగా బౌన్స్ అవుతుండటంతో భారీ షాట్లు ఆడేందుకు అందరు బ్యాటర్లు వెనకడుగు వేశారు. కానీ పంత్ మాత్రం స్వేచ్ఛగా ఆడుతూ పోయాడు. 8 బౌండరీలతో పాటు 2 భారీ సిక్సులు బాదాడు. పంత్ సక్సెస్‌కు కొన్ని కారణాలు చెప్పొచ్చు. అందులో ఒకటి ఫియర్‌లెస్ అప్రోచ్. ఫార్మాట్ ఏదైనా మొదటి బంతి నుంచే బాదుడు షురూ చేయడం పంత్ స్టైల్. ఇవాళ కూడా అదే తరహాలో ఆడాడు. పిచ్ బ్యాటింగ్‌కు సహకరించకపోయినా, బాల్ టర్న్ అవుతున్నా, వికెట్ పోతుందని భయపడలేదు పంత్.
కొండంత అండగా గిల్
స్పిన్నర్ల బౌలింగ్‌లో క్రీజు వదిలి ముందుకొచ్చి మరీ షాట్లు ఆడాడు పంత్. 5 వికెట్లతో దుమ్మురేపిన అజాజ్ పటేల్ బౌలింగ్‌లో పంత్ చెలరేగిపోయాడు. లెంగ్త్, వేరియేషన్స్‌ను వేగంగా పసిగట్టి అటాక్ చేశాడు. అయితే ఫియర్‌లెస్ అప్రోచ్ పేరుతో అతడు అడ్డగోలు షాట్లకు వెళ్లలేదు. బాల్ మెరిట్‌ను బట్టి పక్కా క్లాసికల్ హిట్టింగ్ చేశాడు. తాను ప్రెజర్ తీసుకోకుండా అవతలి జట్టు బౌలర్లపై దాన్ని బదిలీ చేశాడు. అతడు మొదట్నుంచి స్వేచ్ఛగా షాట్లు కొట్టడంతో కివీస్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ తప్పారు. తనదైన శైలిలో ఆడమని, డిఫెన్స్ అక్కర్లేదని టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి భరోసా అందడం కూడా పంత్‌కు బలంగా మారింది. అదే సమయంలో మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్ స్తంభంలా పాతుకుపోవడం పంత్ తన స్టైల్ గేమ్‌ను కంటిన్యూ చేయడానికి ఉపయోగపడింది.
Also Read:
గిల్ క్లాస్ బ్యాటింగ్.. ఇది శానా యేండ్లు యాదుంటది
ఇలా జరుగుతుందని అనుకోలేదు.. అంతా తారుమారు: జడేజా
భారత టూర్‌కు సఫారీ సైన్యమిదే!
For More Sports And Telugu News
Updated Date - Nov 02 , 2024 | 02:32 PM