Rohit Sharma: ఆసీస్ సిరీస్‌లో రోహిత్ ఆడతాడా లేదా.. తేల్చేసిన రితికా
ABN, Publish Date - Nov 10 , 2024 | 08:14 AM
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రాబోయే ఆస్ట్రేలియా టూర్‌లో ఆడటం అనుమానంగా మారింది. దీంతో అతడి ప్లేస్‌లో ఎవర్ని తీసుకోవాలనే దానిపై సెలెక్టర్లు తర్జనభర్జన పడుతున్నారు. ఈ విషయంపై తాజాగా హిట్‌మ్యాన్ సతీమణి రితికా సజ్దే రియాక్ట్ అయింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రాబోయే ఆస్ట్రేలియా టూర్‌లో ఆడటం అనుమానంగా మారింది. హిట్‌మ్యాన్ సతీమణి రితికా సజ్దే త్వరలో మరో బిడ్డకు జన్మను ఇవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి. భార్యకు డెలివరీ నేపథ్యంలో దగ్గరగా ఉండాలని భావిస్తున్న రోహిత్.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం కష్టమేనని అంటున్నారు. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ముగిశాక స్వయంగా అతడే ఈ విషయాన్ని రివీల్ చేశాడు. కంగారూ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో తాను ఆడకపోవచ్చునని అన్నాడు. దీంతో అతడి ప్లేస్‌లో ఎవర్ని తీసుకోవాలనే దానిపై సెలెక్టర్లు తర్జనభర్జన పడుతున్నారు. ఈ విషయంపై తాజాగా రితికా సజ్దే రియాక్ట్ అయింది.
ఫించ్ వర్సెస్ గవాస్కర్
పెర్త్ టెస్ట్‌లో రోహిత్ ఆడతాడా? లేదా? అనే దాని గురించి బాగా చర్చ నడుస్తోంది. ఇటు భారత మాజీ క్రికెటర్లతో పాటు అటు ఆస్ట్రేలియా వెటరన్ ప్లేయర్లు కూడా ఈ విషయంపై కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ హిట్‌మ్యాన్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోతే అతడి స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రాను కెప్టెన్‌గా నియమించాలని సునీల్ గవాస్కర్ అన్నాడు. సిరీస్ మొత్తం రోహిత్‌ను కేవలం ఆటగాడినే ఉంచాలని.. బుమ్రా సారథ్య పగ్గాలు తీసుకోవాలని అన్నాడు. అయితే ఈ విషయంపై ఆసీస్ మాజీ ప్లేయర్ ఆరోన్ ఫించ్ సీరియస్ అయ్యాడు. రోహిత్ గురించి అలా ఎలా కామెంట్ చేస్తారని అన్నాడు. భారత క్రికెట్ జట్టుకు అతడు సారథి అని స్పష్టం చేశాడు.
రితికా రిప్లై ఇదే..
రితికా బిడ్డకు జన్మను ఇవ్వనున్న నేపథ్యంలో కావాలనుకుంటే రోహిత్ పూర్తిగా ఇంటి వద్దే ఉండాలని ఫించ్ సూచించాడు. బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూ ఈ అపురూప క్షణాలను దగ్గర ఉండి ఆస్వాదించాలని పేర్కొన్నాడు. అంతేగానీ అతడ్ని టీమ్‌లో ప్లేయర్‌గా ఆడించి, కెప్టెన్సీకి దూరంగా ఉంచడం కరెక్ట్ కాదంటూ గవాస్కర్‌కు చురకలు అంటించాడు. ఫించ్ వ్యాఖ్యలపై రితికా రియాక్ట్ అయింది. అతడ్ని ట్యాగ్ చేసిన రోహిత్ సతీమణి సెల్యూట్ అంటూ ఎమోజీ పెట్టింది. హిట్‌మ్యాన్‌కు అతడు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతగా ఇలా స్పందించింది. ఇది చూసిన నెటిజన్స్.. ఆమె రిప్లయ్ అదిరిపోయిందని అంటున్నారు. ఒక మ్యాచ్ లేదా పూర్తి సిరీస్‌కు దూరమవ్వాలా అనేది రోహిత్ నిర్ణయమని, అతడి డెసిషన్‌కు ఫ్యామిలీతో పాటు బీసీసీఐ, అభిమానుల నుంచి కూడా సపోర్ట్ ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. గవాస్కర్ లాంటి లెజెండ్ ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదని సీరియస్ అవుతున్నారు.
Also Read:
భారత్‌తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. బిగ్ సర్‌ప్రైజ్
రెండో స్థానానికి టైటాన్స్
దిగ్గజంతో జతకట్టిన నీరజ్
For More Sports And Telugu News
Updated Date - Nov 10 , 2024 | 08:16 AM