Rohit-Nitish: తెలుగోడ్ని నమ్మని రోహిత్.. పాపం సెంచరీ కొట్టినా..
ABN, Publish Date - Dec 31 , 2024 | 07:17 PM
BGT 2024: బాక్సింగ్ డే టెస్ట్ టీమిండియాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఎంత పోరాడినా కనీసం డ్రా కూడా చేయలేకపోయింది. ఇంకో అరగంట బాగా ఆడి ఉంటే మ్యాచ్ కోల్పోకుండా ఉండేది. కానీ అది జరగలేదు.
బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియా పోరాడినా అనుకున్నది సాధించలేకపోయింది. ఎంత ఫైట్ చేసినా మ్యాచ్‌ను డ్రా చేయలేకపోయింది. ఆఖరి రోజు చివరి సెషన్ వరకు ఆస్ట్రేలియాను నిలువరించిన భారత్.. ఆ తర్వాత మాత్రం చేతులెత్తేసింది. ఇంకో గంట సేపు పోరాడితే మ్యాచ్ డ్రా అయ్యేది. అది దాదాపుగా గెలుపుతో సమానంగా మారేది. కానీ కీలక సమయాల్లో రిషబ్ పంత్ (104 బంతుల్లో 30), యశస్వి జైస్వాల్ (208 బంతుల్లో 84) ఔట్ అవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. వీళ్లిద్దరూ ఇంకొంచెం సేపు ఆడి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది. అయితే టీమిండియా ఓటమికి ఈ జోడీ నిష్క్రమణతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న ఓ నిర్ణయం కూడా కారణమని చెప్పాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఇంకేం చేస్తే నమ్ముతారు?
మెల్‌బోర్న్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిశాడు నితీష్ కుమార్ రెడ్డి. 189 బంతుల్లో 114 పరుగుల విలువైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. 8వ నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన తెలుగోడు.. వాషింగ్టన్ సుందర్ (162 బంతుల్లో 50)తో కలసి 127 పరుగులు జోడించాడు. ఈ పార్ట్‌నర్‌షిప్ లేకపోతే మ్యాచ్ మూడ్రోజులకే ముగిసేది. అలాంటి సూపర్బ్ నాక్‌తో కంగారూలకు వణుకు పుట్టించిన నితీష్‌ను రోహిత్ నమ్మలేదు. సెకండ్ ఇన్నింగ్స్‌లో తెలుగోడ్ని కాదని స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను 5వ స్థానంలో బ్యాటింగ్‌కు దింపాడు. ఇదే భారత్ కొంపముంచింది. జడ్డూకు బదులు నితీష్‌ను పంపి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
నితీష్‌కు దక్కని ప్రమోషన్
ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జడేజా.. పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ఒకవేళ జడ్డూ కంటే ముందు నితీష్ బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే.. బోలాండ్‌ను మరింత దీటుగా ఎదుర్కొనేవాడు. బోలాండ్ బౌలింగ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అతడు భారీగా పరుగులు చేశాడు. బోలాండ్‌ను ఎదుర్కొని సెట్ అయి ఉంటే మిగతా బౌలర్లనూ అతడు ఆటాడుకునేవాడు. అంతగా టచ్‌లో లేని జడ్డూను కాస్త వెనక్కి పంపి ఉంటే బాగుండేది. కానీ జడ్డూ అలా వెళ్లి ఇలా ఔటై వచ్చేయడంతో నితీష్ పూర్తి డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్లిపోవడం, ప్రెజర్ ఎక్కువవడంతో మరో వికెట్ పడింది. సెంచరీ బాదిన నితీష్‌తో పాటు సాలిడ్ డిఫెన్స్‌తో గోడలా నిలబడుతున్న సుందర్‌ను బ్యాటింగ్‌లో ప్రమోట్ చేసి.. జడ్డూను కిందకు పంపి ఉంటే ఈ పరిస్థితే వచ్చేది కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రోహిత్ బ్యాటర్‌గానే కాదు.. ప్రణాళికలు వేసి, అమలు చేయాల్సిన సారథిగానూ ఫెయిల్ అయ్యాడనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఓటమికి అతడు పూర్తి బాధ్యత తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Also Read:
మ్యాచ్ పోయినా రివేంజ్ కంప్లీట్.. స్లెడ్జింగ్‌కు భయపడేలా చేశాడుగా..
టీమిండియాను అవమానించిన ఆసీస్.. గెలిచామని ఇంత పొగరా..
అభిషేక్ శర్మ ఊర మాస్ బ్యాటింగ్.. టార్గెట్ చేసి మరీ చితకబాదాడు
For More Sports And Telugu News
Updated Date - Dec 31 , 2024 | 08:11 PM