Rohit-Bumrah: రోహిత్‌కు బుమ్రా భయం.. కెప్టెన్సీ ఇష్యూ కాదు, అసలు మ్యాటర్ వేరే ఉంది
ABN, Publish Date - Dec 09 , 2024 | 01:18 PM
Rohit-Bumrah: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కొత్త చిక్కు వచ్చిపడింది. అసలే అడిలైడ్ టెస్ట్‌లో ఓటమితో ఇంటా, బయట విమర్శలు ఎదుర్కొంటున్నాడు హిట్‌మ్యాన్. ఇలాంటి తరుణంలో పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అతడ్ని భయపెడుతున్నాడు.
Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కొత్త చిక్కు వచ్చిపడింది. అసలే అడిలైడ్ టెస్ట్‌లో ఓటమితో ఇంటా, బయట విమర్శలు ఎదుర్కొంటున్నాడు హిట్‌మ్యాన్. పెర్త్ టెస్ట్‌లో అంత పెద్ద విజయం సాధించి.. పింక్ బాల్ టెస్ట్‌లో ఇంత ఘోరంగా ఓడటం ఏంటని అంతా నిలదీస్తున్నారు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ఫెయిల్ అవడంతో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తొలి టెస్ట్‌లో పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా తాత్కాలిక సారథిగా టీమ్‌ను అద్భుతంగా నడిపించాడని.. కానీ రోహిత్ అందులో విఫలమయ్యాడని అంటున్నారు. కెప్టెన్సీ విషయంలో బుమ్రాతో పోలుస్తూ అతడ్ని టార్గెట్ చేస్తున్నారు. అయితే రోహిత్ దీనికి ఫీల్ అవడం లేదు. మరో విషయంలో బుమ్రా అతడ్ని భయపెడుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
వర్క్‌లోడ్ టెన్షన్
అడిలైడ్ టెస్ట్ రెండో రోజు బుమ్రా అందర్నీ పరేషాన్ చేశాడు. తొడ కండరాలు పట్టేయడంతో అతడు కదల్లేకపోయాడు. దీంతో వెంటనే మెడికల్ టీమ్ వచ్చి అతడికి వైద్యం అందించారు. త్వరగానే కోలుకున్న స్పీడ్ గన్.. మళ్లీ లేచి బౌలింగ్ వేయడం షురూ చేశాడు. ఆ తర్వాత కంటిన్యూస్ స్పెల్స్ కూడా వేశాడు. అయితే బుమ్రా ఫిట్‌నెస్ గురించి మ్యాచ్ తర్వాత మాటలతో అతడి విషయంలో రోహిత్ భయపడుతున్నట్లుగా అనిపిస్తోంది. బుమ్రాపై పని ఒత్తిడి తీవ్రంగా ఉందని.. దాన్ని తగ్గించడం ముఖ్యమని చెప్పాడు. అతడితో మాట్లాడానని.. ఫిట్‌నెస్‌ను పర్యవేక్షించడానికి ఫిజియోలు, ట్రైనర్లు ఉన్నారని రోహిత్ పేర్కొన్నాడు.
రిస్క్ చేస్తారా?
వర్క్‌లోడ్ వల్ల బుమ్రా ఎక్కడ టీమ్‌కు దూరమవుతాడోనని హిట్‌మ్యాన్ భయపడుతున్నాడు. అతడు ఫాస్ట్‌గా రికవర్ అయి అన్ని మ్యాచుల్లో ఆడితే బాగుంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పనిభారం కారణంగా రెస్ట్ ఇచ్చే యోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. కానీ రెండో టెస్టులో ఓడి విమర్శల పాలవుతున్న వేళ ఈ రిస్క్ చేస్తారా? అనేది అనుమానమే. వెటరన్ పేసర్ మహ్మద్ షమి ఆసీస్ ఫ్లైట్ ఎక్కుతున్నాడనే వార్తల నేపథ్యంలో బుమ్రాకు రెస్ట్ ఇస్తారనే న్యూస్ వైరల్ అవుతోంది. అయితే సునీల్ గవాస్కర్ సహా కొందరు మాజీ క్రికెటర్లు మాత్రం దీంతో ఏకీభవించడం లేదు. బుమ్రాను ఐదు టెస్టులు ఆడించాల్సిందేనని అంటున్నారు. అతడు లేకపోతే 20 వికెట్లు తీయలేమని చెబుతున్నారు. దేశానికి ఆడేటప్పుడు వర్క్‌లోడ్ లాంటివి పెట్టుకోవదని వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read:
టీమిండియా బ్లండర్ మిస్టేక్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు
టీమిండియాకు అతనొక్కడే దిక్కు... పాక్ లెజెండ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తప్పంతా హెడ్‌దే.. ఓవరాక్షన్ చేస్తున్నాడు: సిరాజ్
For Sports And Telugu News
Updated Date - Dec 09 , 2024 | 01:23 PM