ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి రోహిత్ శర్మ గుడ్ బై..?

ABN, Publish Date - May 09 , 2024 | 05:38 PM

ముంబై ఇండియన్స్ జట్టుని రోహిత్ శర్మ వీడనున్నాడా? తదుపరి ఐపీఎల్ సీజన్‌లో అతను మరో ఫ్రాంచైజీకి జంప్ కానున్నాడా? అంటే.. అవుననే అభిప్రాయాలే క్రీడా వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టుని రోహిత్ శర్మ (Rohit Sharma) వీడనున్నాడా? తదుపరి ఐపీఎల్ సీజన్‌లో అతను మరో ఫ్రాంచైజీకి జంప్ కానున్నాడా? అంటే.. అవుననే అభిప్రాయాలే క్రీడా వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఐదు టైటిళ్లు సాధించిపెట్టిన తనని కాదని, హార్దిక్ పాండ్యాకు (Hardik Pandya) కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై రోహిత్ అసంతృప్తిగా ఉన్నాడని.. అందుకే అతను జట్టు నుంచి వైదొలగాలని భావిస్తున్నాడని బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. రోహిత్ భవితవ్యంపై మాజీ ఆటగాళ్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్ (Wasim Akram) సైతం.. ముంబైని రోహిత్ వీడొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.


చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్.. టీ20 క్రికెట్‌లో ఆల్‌టైం రికార్డ్

‘‘నా దృష్టిలో రోహిత్ శర్మ వచ్చే సీజన్ నుంచి ముంబై జట్టుకి ఆడకపోవచ్చని అనిపిస్తోంది. అందుకు కారణాలు ఏమైనా కావొచ్చు కానీ, నెక్ట్స్ సీజన్‌లో మాత్రం అతడు ముంబై జట్టుని వీడటం పక్కా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. నాకైతే అతడిని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో చూడాలనుంది. ఓపెనర్‌గా రోహిత్, కెప్టెన్ శ్రేయస్ అయ్యార్, మెంటార్‌గా గౌతమ్ గంభీర్.. ఇది ఊహించుకుంటుంటేనే ఎంతో బాగుంది. ఇప్పుడు కోల్‌కతా బ్యాటింగ్‌ లైనప్‌ ఎంతో పటిష్టంగా తయారైంది. అలాంటి జట్టుకి రోహిత్ శర్మ తోడైతే.. ఇక కోల్‌కతాకు తిరుగుండదు. రోహిత్ ఒక గొప్ప ఆటగాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అతడు ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై భారీ ఇన్నింగ్స్ ఆడగలడు. అందుకే.. కేకేఆర్ తరఫున రోహిత్ ఆడితే చూడాలని ఉందని చెబుతున్నా’’ అని వసీమ్ అక్రమ్ చెప్పుకొచ్చాడు.

కేఎల్ రాహుల్‌పై లక్నో ఓనర్ మండిపాటు.. నెటిజన్ల కౌంటర్ ఎటాక్

అటు.. రోహిత్ శర్మ అభిమానులు సైతం ముంబై ఇండియన్స్ జట్టుని వీడాలని, మరో ఫ్రాంచైజీకి వెళ్లి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నారు. గతంలో దక్కన్ చార్జర్స్ తరఫున రోహిత్ ఆడాడు కాబట్టి.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి తిరిగి రావాలని ఆశిస్తున్నారు. ఇదే సమయంలో.. ఆర్సీబీ జట్టు ఇంతవరకూ ఒక్క కప్ కూడా కొట్టలేదు కాబట్టి, ఆ జట్టులో రోహిత్ శర్మ చేరితే అది పటిష్టంగా తయారవుతుందని, ఫలితంగా కప్ కూడా వస్తుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. మరి.. రోహిత్ భవితవ్యం ఎలా ఉంటుందనేది తెలియాలంటే, వచ్చే సీజన్ వరకూ వేచి చూడాల్సిందే.

Read Latest Sports News and Telugu News

Updated Date - May 09 , 2024 | 05:38 PM

Advertising
Advertising