Rohit Sharma: కొడుకుకు నామకరణం చేసిన రోహిత్.. పేరు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
ABN, Publish Date - Dec 01 , 2024 | 02:50 PM
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇటీవల కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. అయితే రితికా-హిట్‌మ్యాన్ దంపతులు తమ కుమారుడి పేరు గానీ ఫొటో గానీ బయటపెట్టలేదు. రోహిత్ వారసుడి విశేషాలు తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇటీవల కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. అయితే రితికా-హిట్‌మ్యాన్ దంపతులు తమ కుమారుడి పేరు గానీ ఫొటో గానీ బయటపెట్టలేదు. రోహిత్ వారసుడి విశేషాలు తెలుసుకోవాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే స్టార్ క్రికెటర్ మాత్రం ఆ విషయాలు చాలా రహస్యంగా ఉంచుతున్నారు. రితికా డెలివరీ ముగిశాక ఆస్ట్రేలియాకు చేరుకున్నాక కూడా తనయుడి వివరాలు మాత్రం అతడు బయటపెట్టలేదు. దీంతో ఫ్యాన్స్ ఇంకా ఎన్నాళ్లు వెయిట్ చేయాలని భావిస్తున్న తరుణంలో రోహిత్ వాళ్లకు సర్‌ప్రైజ్ న్యూస్ చెప్పేశాడు. తన కొడుకు పేరేంటో అతడు రివీల్ చేశాడు.
భలేగా ఉందే..
రోహిత్ తన కుమారుడికి అహాన్ శర్మ అని నామకరణం చేశాడు. ఈ విషయాన్ని ఓ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా రితికా సజ్దే తెలియజేసింది. క్రిస్‌మస్ నెల కావడంతో సెలబ్రేషన్స్ మొదలైపోయాయంటూ ఒక పోస్ట్ చేసింది హిట్‌మ్యాన్ సతీమణి. ఇందులో నాలుగు శాంటాక్లాజాలు ఉన్నాయి. వాటిలో రోహిత్, సజ్జేతో పాటు కూతురు సమైరా ఉన్నారు. అలాగే కొడుకు అహాన్ పేరుతో ఉన్న మినీ శాంటాక్లాజాను కూడా ఆ ఫొటోలో చూడొచ్చు. నేరుగా అహాన్ అని చెప్పకుండా క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ కొడుకు పేరు రివీల్ చేయడం స్పెషల్‌గా నిలిచింది.
అర్థం ఏంటంటే..
రోహిత్ కొడుకు పేరు అహాన్ అని తెలియడంతో ఈ పదానికి అర్థం ఏంటని తెలుసుకునే పనిలో పడ్డారు క్రికెట్ అభిమానులు. అహాన్ అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. సూర్యోదయం, ఉదయపు వెలుగు, ఆశాకిరణం అనే అర్థాలు కనిపిస్తున్నాయి. బహుశా ప్రకృతితో ముడిపడి ఉన్న పేరు పెట్టాలనే ఉద్దేశంలో అహాన్ అని నామకరణం చేసి ఉంటారని నెటిజన్స్ అంటున్నారు. కాగా, పెర్త్ టెస్ట్‌కు దూరమైన రోహిత్.. అడిలైడ్ మ్యాచ్‌కు రెడీ అవుతున్నాడు. అక్కడే ఆసీస్ ఆట ముగించాలని భావిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు.
Also Read:
హర్షిత్ రానా విధ్వంసం
గిల్ రాకతో ఆ ఇద్దరు అవుట్.. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండేది వీరే..
ఐపీఎల్‌లో అమ్ముడుపోలేదు.. వదిలేసిన జట్లకు అలా బుద్ధిచెప్పారు..
For Sports And Telugu News
Updated Date - Dec 01 , 2024 | 03:08 PM