ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rohit Sharma: రెచ్చగొడితే ఊరుకోవాలా.. బరాబర్ తిడతాం అంటున్న రోహిత్

ABN, Publish Date - Dec 09 , 2024 | 10:41 AM

Rohit Sharma: ఎప్పుడూ కూల్‌గా, కామ్‌గా ఉండే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సీరియస్ అయ్యాడు. రెచ్చగొడితే ఊరుకోవాలా అని ప్రశ్నించాడు. బరాబర్ తిడతామంటూ ఫైర్ అయ్యాడు.

IND vs AUS: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడూ కామ్‌గా, కూల్‌గా ఉంటాడు. టీమ్ వ్యవహారాల్లో తలమునకలై ఉండే హిట్‌మ్యాన్.. జూనియర్లు, సీనియర్లు అనే తేడాల్లేకుండా అందరితో కలసిపోతాడు. ప్రతి ప్లేయర్‌ తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టేలా ఎంకరేజ్ చేస్తాడు. ఎవరి మీద అతడు కోప్పడిన ఘటనలు అంతగా కనిపించవు. ఒకవేళ సీరియస్ అయినా షార్ట్ గ్యాప్‌లో వాళ్లతో కలసిపోతాడు. అలాంటోడు ఒక్కసారిగా అగ్రెసివ్ అయిపోయాడు. రెచ్చగొడితే ఊరుకోవాలా.. బరాబర్ తిడతామంటున్నాడు. కూల్‌గా ఉండే హిట్‌మ్యాన్ ఇంతగా సీరియస్ అవడానికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..


తప్పేంటి?

అడిలైడ్ టెస్ట్‌లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన గొడవపై రోహిత్ రియాక్ట్ అయ్యాడు. సిరాజ్ చేసిన దాంట్లో తప్పేమీ లేదంటూ అతడికి మద్దతుగా నిలిచాడు హిట్‌మ్యాన్. రెచ్చగొడితే తిట్టాడన్నాడు. ‘ఒక కెప్టెన్‌గా నా జట్టును నడపడం నా బాధ్యత. ఆటగాళ్లు దూకుడుగా ఉండేలా చూసుకోవడం కూడా నా పనే. మ్యాచ్ సమయంలో ప్రత్యర్థి జట్టు ప్లేయర్లను ఒకట్రెండు మాటలు అనడంలో ఏమాత్రం తప్పు లేదు. సిరాజ్‌కు ఇది ఇష్టం కూడా. అదే అతడికి సక్సెస్ ఇస్తోంది’ అని రోహిత్ స్పష్టం చేశాడు. ఇలాంటి ఘటనలు సిరాజ్‌లోని బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ను బయటకు తీసుకొస్తున్నాయని చెప్పుకొచ్చాడు.


అది టీమిండియా ఇష్టం

సిరాజ్ చేసింది తప్పు కాదని.. అపోజిషన్ టీమ్ ప్లేయర్లు రెచ్చగొడితే బరాబర్ తిడతామంటూ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశాడు రోహిత్. ఈ వివాదంపై ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా స్పందించాడు. ‘భారత్ తమకు నచ్చింది చేయొచ్చు. కానీ మా జట్టు ఆటగాళ్ల విషయంలో ఆందోళనగా ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ హీటెక్కుతోంది. ఇది చాలా పెద్ద సిరీస్. ప్రతి మ్యాచ్‌కు ప్రతి రోజు స్టేడియాలు నిండిపోతున్నాయి. కాబట్టి చెదురుమదురు ఘటనలు జరగొచ్చు. ట్రావిస్ హెడ్ మా టీమ్‌కు వైస్ కెప్టెన్. అతడు బిగ్ ప్లేయర్. దేనికైనా సరే అతడు నిలబడి పోరాడతాడు’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. కాగా, పింక్ బాల్ టెస్ట్ రెండో రోజు హెడ్ ఔట్ అయిన సమయంలో సిరాజ్ వెళ్లమని అనడం, ఆసీస్ బ్యాటర్ అతడ్ని తిట్టడం కాంట్రవర్సీగా మారింది. భారత పేసర్ కూడా తనదైన స్టైల్‌లో ఇచ్చిపడేయడం గమనార్హం.


Also Read:

పీకల మీదకు తెచ్చుకున్న గంభీర్.. అంతా స్వయంకృతమే

సెమీస్‌లో శ్రీకాంత్‌, గాయత్రి జోడీ

స్ట్రయికర్స్‌ జెర్సీ ఆవిష్కరణ

విడిపోయిన సింధు.. పార్క్ తే సంగ్

For Sports And Telugu News

Updated Date - Dec 09 , 2024 | 10:55 AM