ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rohit Sharma: ఆస్ట్రేలియాకు రోహిత్ పయనం.. కానీ ఊహించని ట్విస్ట్

ABN, Publish Date - Nov 21 , 2024 | 06:29 PM

Rohit Sharma: రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడంతో పెర్త్ టెస్ట్‌లో భారత్ ఎలా ఆడుతుందా అని అంతా వర్రీ అవుతున్నారు. ఈ తరుణంలో ఓ సూపర్ న్యూస్. రోహిత్ వచ్చేస్తున్నాడు. కానీ ఓ చిన్న ట్విస్ట్ ఉంది.

IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని మరోమారు కైవసం చేసుకోవాలని చూస్తోంది టీమిండియా. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ నుంచే పట్టుబిగించాలని భావిస్తోంది. పెర్త్ టెస్ట్‌లో కంగారూలకు ఎర్త్ పెట్టాలని అనుకుంటోంది. అందుకోసం బలమైన జట్టుతో బరిలోకి దిగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో టీమ్ పెర్ఫార్మెన్స్‌పై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతోంది. ఈ తరుణంలో ఓ సూపర్ న్యూస్. మరికొన్ని గంటల్లో ఆస్ట్రేలియాలో వాలిపోనున్నాడు హిట్‌మ్యాన్. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..


ఫ్లైట్ ఎక్కడమే తరువాయి..

కొడుకు పుట్టడంతో పెర్త్ టెస్ట్‌కు రోహిత్ దూరమవుతాడని అంతా భావించారు. అందుకు తగ్గట్లే అతడు ఇంకా ఆసీస్‌కు రాకపోవడంతో ఈ మ్యాచ్‌లో అతడు ఆడడని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే హిట్‌మ్యాన్ ఆసీస్‌కు పయనం కానున్నాడు అనే వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. తాను అందుబాటులో ఉన్నానని.. పెర్త్‌కు పయనం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని భారత క్రికెట్ బోర్డుకు రోహిత్ సమాచారం అందజేశాడని తెలుస్తోంది. కంగారూ ఫ్లైట్ ఎక్కేందుకు ఉత్సాహంతో ఉన్నానని చెప్పాడట. నవంబర్ 23న ముంబైలో విమానం ఎక్కనున్నాడని క్రికెట్ వర్గాల సమాచారం.


కంగారెత్తించడం ఖాయం

నవంబర్ 24 కల్లా రోహిత్ పెర్త్‌‌కు చేరుకుంటాడని తెలుస్తోంది. ఆ తర్వాత కొన్ని గంటల పాటు విశ్రాంతి తీసుకుంటాడట. అనంతరం కోచింగ్ స్టాఫ్‌తో సమావేశమై అడిలైడ్‌లో జరిగే డే అండ్ నైట్ టెస్ట్‌కు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ప్లాన్ చేస్తాడట. కాన్‌బెర్రా వేదికగా నవంబర్ 30న ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో జరిగే మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ బరిలోకి దిగనున్నాడట. ఆ మ్యాచ్‌ను మంచి ప్రాక్టీస్‌గా వాడుకోవాలని భావిస్తున్నాడట. ఫామ్, ఫిట్‌నెస్‌ను ఇంప్రూవ్ చేసుకొని కంగారూలను కంగారెత్తించనున్నాడని తెలుస్తోంది. రోహిత్ వస్తున్నాడంటే పెర్త్ టెస్ట్‌లో ఆడేందుకు అనుకుంటారు. కానీ అతడు తర్వాతి టెస్ట్ కోసం సన్నాహాల్లో మునిగిపోనున్నాడు.


Also Read:

పెర్త్ టెస్ట్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. మళ్లీ శనిలా దాపురించాడు

బాప్‌రే..కోహ్లీ బ్యాట్‌ ఖరీదు!

ఒలింపిక్స్‌ ఆతిథ్య రేసులో ఆగ్రా!

For More Sports And Telugu News

Updated Date - Nov 21 , 2024 | 07:20 PM