Share News

Gambhir-Rohit: గంభీర్‌కు రోహిత్ భయం.. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అంటే ఇదే

ABN , Publish Date - Nov 08 , 2024 | 04:56 PM

అసలే న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అవడంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇలాంటి తరుణంలో అతడికి మరింత తలనొప్పి తెప్పిస్తున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ.

Gambhir-Rohit: గంభీర్‌కు రోహిత్ భయం.. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అంటే ఇదే

న్యూజిలాండ్ సిరీస్‌లో వైట్‌వాష్ అవడంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్‌ను అందరూ టార్గెట్ చేస్తున్నారు. అతడి వ్యూహాలు, తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్‌ను కోల్పోయినా కొత్త కోచ్ కదా అని గౌతీకి మద్దతు లభించింది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. సొంతగడ్డపై క్లీన్‌స్వీప్ అవడం, ఎన్నడూ లేనంత దారుణంగా ఓటమి పాలవడాన్ని అభిమానులే కాదు.. భారత క్రికెట్ బోర్డు పెద్దలు కూడా జీర్ణించుకోవడం లేదు. దీంతో గౌతీ అధికారాలకు కత్తెర వేసే దిశగా చర్యలు ఊపందుకున్నాయని తెలుస్తోంది. ఈ తరుణంలో అతడికి తలనొప్పిగా మారాడు కెప్టెన్ రోహిత్ శర్మ.


తొలి టెస్ట్‌కు దూరం

రోహిత్ తీసుకున్న నిర్ణయంతో గంభీర్ భయపడుతున్నాడని తెలుస్తోంది. గౌతీ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి, వెనుక గొయ్యి అనేలా ఉందట. కోచ్‌ను భయపెట్టేంతగా హిట్‌మ్యాన్ ఏం డెసిషన్ తీసుకున్నాడనేది ఆసక్తికరంగా మారింది. త్వరలో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఎలాగైనా గెలవాలని టీమిండియా అనుకుంటోంది. ఆసీస్‌ను ఓడించి తమ మీద వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని గౌతీ భావిస్తున్నాడు. అయితే సిరీస్‌లోని తొలి టెస్ట్‌కు సారథి రోహిత్ అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. దీనికి కారణం అతడి సతీమణి రితికా త్వరలో మరో బిడ్డకు జన్మను ఇవ్వనుండటమేనని సమాచారం. రితికా డెలివరీ నేపథ్యంలో ఆమెకు దగ్గరగా ఉండాలని రోహిత్ భావిస్తున్నాడట.


ఇద్దరూ ముంచేశారు

కివీస్ సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ ఇదే విషయం చెప్పాడు. ఆసీస్ టూర్‌లో తొలి టెస్టులో ఆడటం కష్టమేనని అన్నాడు. దీంతో అతడి స్థానంలో ఎవర్ని తీసుకుంటారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. కేఎల్ రాహుల్‌తో పాటు అభిమన్యు ఈశ్వరన్‌ను ఈ రోల్ కోసం అనుకుంటున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే రాహుల్‌ను కాస్త ముందే ఆసీస్‌కు పంపి, ఆ దేశ ఏ టీమ్‌తో మ్యాచ్‌లో ఆడించారు. కానీ ఏం లాభం.. అటు అభిమన్యుతో పాటు ఇటు రాహుల్ కూడా ఫెయిల్ అయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఇద్దరూ కనీసం హాఫ్ సెంచరీ కూడా బాదలేదు. దీంతో రోహిత్ స్థానంలో ఎవర్ని ఆడించాలా అని గంభీర్ తలపట్టుకుంటున్నాడట. హిట్‌మ్యాన్ సెలవు తెచ్చిన తంటాను ఎలా పరిష్కరించాలా అని తెగ టెన్షన్ పడుతున్నాడట. మరి.. ఈ సమస్యను గౌతీ ఎలా సాల్వ్ చేస్తాడో చూడాలి.


Also Read:

పరువు తీసుకున్న రాహుల్.. వెళ్లి రంజీలు ఆడుకో పో..

ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇలాంటి ఆట పాక్‌కే సాధ్యం

కుర్రాళ్లు కుమ్మేస్తారా?

For More Sports And Telugu News

Updated Date - Nov 08 , 2024 | 05:05 PM