Share News

IND vs AUS: అదే టీమిండియా కొంపముంచిందా.. ఆసిస్‌తో ఓటమికి 3 కారణాలు

ABN , Publish Date - Dec 08 , 2024 | 12:36 PM

టీమిండయా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తొలి టెస్టులో విజయకేతనం ఎగురవేసిన టీమిండియా రెండో టెస్టులో కుప్పకూలింది.. ఇందుకు ప్రధాన కారణాలు..

IND vs AUS: అదే టీమిండియా కొంపముంచిందా.. ఆసిస్‌తో ఓటమికి 3 కారణాలు
Rohit Sharma, Virat Kohli

తొలి టెస్టులో నెగ్గి దూకుడుమీదున్న టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని ఆస్ట్రేలియా జట్టు పటాపంచలు చేసింది. ఐదు మ్యాచుల సిరీస్ లో రెండో మ్యాచ్ ను 10 వికెట్ల తేడాతో ఎగరేసుకుపోయింది. ఆతిథ్య జట్టు బౌలింగ్ అటాక్ ను తట్టుకోలేకపోయిన టీమిండియా బ్యాటర్లు తొలి రెండు ఇన్నింగ్స్ లో 355 పరుగులు చేశారు. ఆ జట్టు క్రికెటర్ ట్రావిస్ హెడ్ ఈ సారి జట్టు బాధ్యతను భుజాలకెత్తుకున్నాడు. అంతా తానై నడిపించి రోహిత్ సేనను ఇరకాటంలోకి నెట్టాడు. మ్యాచ్ ను గెలిచేందుకు ప్రయత్నించినప్పటికీ టీమిండియా జట్టు శ్రమకు ఫలితం దక్కలేదు. అయితే, ఈ ఓటమికి ప్రధానంగా మూడు కారణాలు వినిపిస్తున్నాయి.


రోహిత్‌కు ఏమైంది..

తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా అగ్రెసివ్ కెప్టెన్సీ టీమిండియాను ఊహించని విధంగా విజయం వైపు నడిపించింది. కెప్టెన్ తీసుకునే నిర్ణయాలు జట్టును ఓటమి అంచునుంచైనా ఎలా బయటపడేయగలవనే విషయాన్ని బుమ్రా చెప్పకనే చెప్పాడు. కెప్టెన్ గా అవసరానికి తగ్గట్టుగా బౌలింగ్ ఆర్డర్ లో మార్పులు చేయడం దగ్గరినుంచి అనుక్షణం జట్టు విజయం కోసం తపించడం వరకు అతడి ప్రదర్శన ఆకట్టుకుంది. అయితే, రోహిత్ ఈ విషయంలో విఫలమైనట్టు అనిపిస్తోంది. ఆడిలైడ్ లో రెండో రోజు జరిగిన మ్యాచ్ లోనూ బుమ్రా మెక్ స్వీనీ, స్టీవ్ స్మిత్, నాథన్ వికెట్లను కూల్చి ఒక్కసారిగి జట్టును గెలుపు ట్రాక్ లోకి ఎక్కించాడు.


పతనం అక్కడే మొదలైంది..

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య గతంలో ఎన్నో మ్యాచులు జరిగాయి. అయితే, అన్నింట్లో కామన్ గా టీమిండియాకు ఎదురయ్యే తలనొప్పి ఒక్కటే. అదే ట్రావిన్స్ హెడ్.. మిగిలిన ఏ ఆటగాడినైనా పెవిలియన్ కు పంపగలరేమో గానీ.. ఇతగాడిని డిస్ మిస్ చేయడం భారత క్రికెటర్లకు అంత తేలికైన విషయం కాదు. ఎప్పటిలాగే ఓ అద్భుతమైన సెంచరీతో స్కోర్ బోర్డులో కీలక మార్పులను చేశాడు. దీంతో టీమిండియా పతనం అక్కడే మొదలైంది.


చేతులెత్తేసిన బ్యాటర్లు..

టీమిండియాలో పేరు మోసిన స్టార్ బ్యాటర్లు ఉన్ప్పటికీ రెండు ఇన్నింగ్స్ లోనూ వారు చేతులెత్తేయడం గమనార్హం. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు నిలబడలేకపోయారు. జట్టులో ఒక్క నితీష్ కుమార్ రెడ్డి తప్ప మరెవ్వరూ రాణించలేదు. నితీష్ స్టార్ బ్యాటర్లను సైతం తలదన్నే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండు ఇన్నింగ్స్ లోనూ కలిపి 84 పరుగులు చేశాడు. ఇక ఆసిస్ దిగ్గజాలు పాట్ కమిన్స్, మిచ్ స్టార్క్, స్కాట్ బొలాండ్ ముంగిట విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా నిలవలేకపోయారు.

IND vs AUS: నిలువునా ముంచిన బ్యాటర్లు.. భారత్ ఘోర పరాజయం


Updated Date - Dec 08 , 2024 | 12:36 PM