ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: మైలురాయిని చేరుకున్న ఆర్సీబీ.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో జట్టుగా..

ABN, Publish Date - Mar 30 , 2024 | 06:22 PM

ఐపీఎల్ చరిత్రలో(IPL) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టు అరుదైన మైలురాయిని చేరుకుంది. శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో( Kolkata Knight Riders) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లంతా కలిసి 11 సిక్సులు బాదారు.

బెంగళూరు: ఐపీఎల్ చరిత్రలో(IPL) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టు అరుదైన మైలురాయిని చేరుకుంది. శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో( Kolkata Knight Riders) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లంతా కలిసి 11 సిక్సులు బాదారు. ఇందులో విరాట్ కోహ్లీ 4, దినేష్ కార్తీక్ 3, కామెరూన్ గ్రీన్ 2, ఫాప్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ చెరో సిక్సు బాదారు. దీంతో ఐపీఎల్ చరిత్రలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 1500 సిక్సులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్‌లో 1500 సిక్సులు పూర్తి చేసుకున్న రెండో జట్టుగా చరిత్ర సృష్టించింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ ఆర్సీబీ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఆర్సీబీ ఖాతాలో 1507 సిక్సులున్నాయి. 1575 సిక్సులు బాదిన ముంబై ఇండియన్స్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నైసూపర్ కింగ్స్(1421), పంజాబ్ కింగ్స్ (1405), కోల్‌కతా నైట్ రైడర్స్(1378), ఢిల్లీ క్యాపిటల్స్(1229), రాజస్థాన్ రాయల్స్(1144), సన్‌రైజర్స్ హైదరాబాద్ (893), లక్నోసూపర్ జెయింట్స్(238), గుజరాత్ టైటాన్స్(210) ఉన్నాయి.

SRH vs MI: ముంబై, సన్‌రైజర్స్ మ్యాచ్‌లో కావ్య మారన్ సెలబ్రేషన్స్ వైరల్.. ఫోకస్ మొత్తం ఆమెపైనే!


ఇక మ్యాచ్ విషయానికొస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై కోల్‌కతా నైట్ రైడర్స్(Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders) జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 82 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ(Virat Kohli) నాటౌట్‌గా నిలిచాడు. ఆర్సీబీ జట్టులో కోహ్లీ మినహా మిగతా బ్యాటర్లెవరూ రాణించలేకపోయారు. గ్రీన్ 33 పరుగులతో పర్వాలేదనిపించాడు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రానా, రస్సెల్ రెండేసి వికెట్లు.. నరైన్ ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యాన్ని కోల్‌కతా మరో 3 ఓవర్లు మిగిలి ఉండగానే చేధించింది. ఆ జట్టు బ్యాటర్లు వెంకటేష్ అయ్యర్(50), సునీల్ నరైన్(47), శ్రేయాస్ అయ్యర్(39), ఫిలిప్ సాల్ట్(30) చెలరేగారు. ఈ ఓటమితో ఈ సీజన్‌లో హోంగ్రౌండ్‌లో ఓడిన మొదటి జట్టుగా బెంగళూరు నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024: గంభీర్-కోహ్లీకి ఆస్కార్ ఇవ్వాలి.. దిగ్గజ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు

IPL 2024: లక్నోసూపర్ జెయింట్స్‌లో కీలక మార్పు.. స్టార్ ఆటగాడి స్థానంలో మరో బౌలర్!

Updated Date - Mar 30 , 2024 | 06:32 PM

Advertising
Advertising