Sachin Tendulkar: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సచిన్.. చెప్పినట్లుగానే పారా క్రికెటర్‌ను కలిసిన మాష్టర్
ABN, Publish Date - Feb 24 , 2024 | 10:07 PM
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. తాను గతంలో చెప్పినట్టుగానే ప్రముఖ పారా క్రికెటర్ అమీర్ హుస్సేన్ లోన్‌ను కలిశాడు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న సచిన్.. జమ్మూకశ్మీర్ పారా క్రికెట్ జట్టు కెప్టెన్ అమీర్‌ను తన హోటల్ గదికి ఆహ్వానించాడు.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. తాను గతంలో చెప్పినట్టుగానే ప్రముఖ పారా క్రికెటర్ అమీర్ హుస్సేన్ లోన్‌ను కలిశాడు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న సచిన్.. జమ్మూకశ్మీర్ పారా క్రికెట్ జట్టు కెప్టెన్ అమీర్‌ను తన హోటల్ గదికి ఆహ్వానించాడు. అతడితో ముచ్చటించిన సచిన్ తన సంతకంతో కూడిన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. దివ్యాంగ క్రికెటర్ అయినా అమిర్ బ్యాటింగ్, బౌలింగ్ ఎలా చేస్తాడో అడిగి మరీ మెళకువలు నేర్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అమీర్ తన ఎక్స్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘‘అమీర్ నిజమైన హిరో. స్పూర్తిదాయకమైన వ్యక్తి. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది’’ అని రాసుకొచ్చాడు.
క్రికెట్‌పై విపరీతమైన ఆసక్తి ఉన్న అమీర్ 8 ఏళ్ల వయసులోనే తన రెండు చేతులను కోల్పోయాడు. తన తండ్రి మిల్లులో జరిగిన ఓ ప్రమాదంలో దురదృష్టవశాత్తూ తన రెండు చేతులను కోల్పోవలసి వచ్చింది. అయినప్పటికీ అమీర్ కుంగిపోలేదు. క్రికెట్‌పై ఉన్న తన ఆసక్తిని కూడా చంపుకోలేదు. అమీర్‌లోని ప్రతిభను గుర్తించిన ఓ ఉపాధ్యాయుడు అతడిని పారా క్రికెట్ వైపు ప్రోత్సాహించాడు. అలా పారా క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అమీర్.. తన మెడ, భుజం సాయంతో బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్ చేశాడు. పారా క్రికెట్‌లో ఆరితేరాడు. చేతిని తిప్పి వేసినట్టుగానే కుడి కాలి వేళ్ల మధ్య బంతిని ఇరికించుకుని, కాలిని తిప్పి బౌలింగ్ వేస్తున్నాడు. 34 ఏళ్ల అమీర్ 2013లో ఫ్రొఫెషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. పారా క్రికెట్‌లో విశేషంగా రాణిస్తున్న అమీర్ ప్రస్తుతం జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా సచిన్ కంట పడ్డాయి. అమీర్ నైపుణ్యానికి సచిన్ ఫిదా అయిపోయాడు. ఈ క్రమంలోనే ఏదో ఒక రోజు అమీర్‌ను కలుస్తానని చెప్పాడు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ పర్యటనలో ఉన్న సచిన్ అన్నట్టుగానే అమీర్‌ను కలిశాడు. ఇందుకు సబంధించిన వీడియోలు నెట్టింట్ వైరల్‌గా మారగా సచిన్, అమీర్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 24 , 2024 | 10:13 PM