Sachin Tendulkar: టీమిండియాపై సచిన్ సీరియస్.. ఊరుకునేది లేదంటూ..
ABN, Publish Date - Nov 03 , 2024 | 07:58 PM
Sachin Tendulkar: న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అవడంతో భారత జట్టుపై ముప్పేట దాడి జరుగుతోంది. ఇదేం ఆటతీరు, ఇంతకంటే చెత్తాట చూడలేదంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఊరుకునేది లేదంటూ సీరియస్ అయ్యాడు.
IND vs NZ: న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అవడంతో భారత జట్టుపై ముప్పేట దాడి జరుగుతోంది. ఇదేం ఆటతీరు, ఇంతకంటే చెత్తాట చూడలేదంటూ విమర్శలు వస్తున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి స్టార్లు ఉన్న జట్టు సొంతగడ్డపై హ్యాట్రిక్ ఓటములు మూటగట్టుకోవడం ఏంటని అంతా షాక్ అవుతున్నారు. పసికూన మాదిరిగా ఆడటం, కనీస పోటీ ఇవ్వకపోవడం, స్పిన్ ఆడటమే రాదన్నట్లుగా బ్యాట్లెత్తేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ వరుస ఓటములపై అతడు సీరియస్ అయ్యాడు. ఊరుకునేది లేదన్నాడు. మాస్టర్ బ్లాస్టర్ ఇంకా ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..
మింగుడు పడట్లేదు
టీమిండియా ఓటమిపై ట్విట్టర్ వేదికగా సచిన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మ్యాచ్ అయిపోగానే ఓ ట్వీట్ చేసిన మాస్టర్.. అందులో భారత ఆటగాళ్లు ఆడిన విధానంపై సీరియస్ అయ్యాడు. సొంతగడ్డ మీద 0-3 తేడాతో సిరీస్‌ను కోల్పోవడం మింగుడు పడని విషయమన్నాడు. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నానని వాపోయాడు. ఈ ఓటములపై ఆత్మపరిశీలన చేసుకోక తప్పదన్నాడు. ఎక్కడ తప్పు జరిగింది? పొరపాట్లు ఎలా దొర్లాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. సిరీస్ కోసం సన్నద్ధమైన తీరు, షాట్ సెలెక్షన్, మ్యాచ్ ప్రాక్టీస్.. ఇలా అసలు మిస్టేక్ ఎక్కడ జరిగిందో కనుక్కోవాలన్నాడు సచిన్.
తప్పులు తెలుసుకోవాలి
సిరీస్‌కు సరిగ్గా సన్నద్ధం కాలేకపోయామా? మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఓడామా? చెత్త షాట్ సెలెక్షనే దీనికి కారణమా? అనేది కనుక్కోవాల్సిన అవసరం ఉందని తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు సచిన్. ఆఖరి టెస్ట్‌లో యంగ్ బ్యాటర్లు శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్ ఆడిన తీరును బ్యాటింగ్ లెజెండ్ మెచ్చుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో గిల్ బాగా ఆడాడని.. రెండు ఇన్నింగ్స్‌ల్లో పంత్ అదరగొట్టాడని ప్రశంసల జల్లులు కురిపించాడు. పంత్ ఫుట్‌వర్క్ అదిరిపోయిందని, అతడు ఆడుతుంటే ఇంకో పిచ్ మీద మ్యాచ్ జరుగుతోందా? అనే అనుమానం కలిగిందన్నాడు. నిలకడైన ఆటతీరుతో సిరీస్‌ను సొంతం చేసుకున్న కివీస్‌ను సచిన్ అభినందించాడు. ఇది గొప్ప విజయమన్నాడు.
Also Read:
సర్ఫరాజ్ కెరీర్ క్లోజ్.. ఇంక డొమెస్టికే దిక్కు
టీమిండియాకు విలన్లుగా రోహిత్-కోహ్లీ.. ఆ ఒక్క తప్పుతో..
తప్పు నాదే.. ఒప్పుకుంటున్నా: రోహిత్ శర్మ
For More Sports And Telugu News
Updated Date - Nov 03 , 2024 | 08:12 PM