ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sanju Samson: సంజూ శాంసన్‌కు ఊహించని అదృష్టం.. ఏకంగా రోహిత్‌కే..

ABN, Publish Date - Nov 09 , 2024 | 09:29 PM

టీమిండియాలో స్పెషల్ టాలెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు సంజూ శాంసన్. అయితే ఇన్నాళ్లూ సరైన అవకాశాలు లేక సతమతమైన ఈ కేరళ సెన్సేషన్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో అదరగొడుతున్నాడు.

సంజూ శాంసన్.. ప్రస్తుత జనరేషన్‌లో మోస్ట్ టాలెంటెడ్‌గా గుర్తింపు సంపాదించిన ప్లేయర్. కానీ ఏం లాభం? పదేళ్ల కిందే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చినా ఇప్పటిదాకా టీమ్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకోలేదు. తన తర్వాత వచ్చిన పలువురు జూనియర్లు సెటిలైనా సంజూ మాత్రం టీమ్‌లో అడపాదడపా వచ్చిపోతుండటమే తప్ప బెర్త్ ఫిక్స్ చేసుకోలేదు. సరైన అవకాశాలు రాకపోవడం, ఒకవేళ ఛాన్సులు వచ్చినా అతడు ఫెయిల్ అవడం.. ఇలా ఉండేది పరిస్థితి. అందుకే దురదృష్టం అంటే శాంసన్‌దే అనే పేరొచ్చేసింది. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో కొత్త హీరోగా అవతరించాడు సంజూ. అతడి గుడ్ టైమ్ స్టార్ట్ అయిందనడానికి మరో ఎగ్జాంపుల్ కూడా ఉంది. అది వింటే అదృష్టం అంటే సంజూదే అని మీరూ అనకమానరు.


గౌతీ-సూర్య సపోర్ట్‌తో..

ఆస్ట్రేలియాతో త్వరలో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సంజూను ఆడించాలని సెలెక్టర్లు భావిస్తున్నారట. అది కూడా కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో అని తెలుస్తోంది. అదేంటి.. లిమిటెడ్ ఓవర్స్ టీమ్‌లోనే ఇంకా సెటిల్ అవలేదు. అలాంటిది ఏకంగా టెస్ట్ జట్టులో, అది కూడా హిట్‌మ్యాన్‌కు రీప్లేస్‌మెంట్‌గానా? అని షాకవుతున్నారా? అయితే ఇంత హఠాత్తుగా సంజూ పేరు తెర మీదకు రావడానికి కొన్ని బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. జట్టులో స్థానం కోసం యుద్ధం చేసే సంజూకు కొత్త కోచ్ గౌతం గంభీర్ రూపంలో మంచి అండ దొరికింది. టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రోత్సాహం కూడా తోడవడంతో ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సెంచరీతో చెలరేగాడు సంజూ.


సంజూ వైపే చూపు

ఓపెనర్‌గా ప్రమోషన్ రావడం, ఫెయిలైనా జట్టులో ప్లేస్ పక్కా అనే హామీ ఉండటంతో సంజూ పరుగుల తుఫాన్ సృష్టించాడు. సౌతాఫ్రికా టూర్‌లోనూ అదే జోరును కంటిన్యూ చేస్తున్నాడు. నిన్న జరిగిన తొలి టీ20లో మెరుపు శతకంతో అదరగొట్టాడు. బౌండరీలు, సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లకు నరకం చూపించాడు. సంజూ నిలకడగా ఆడుతుండటం, బ్యాటింగ్ టెక్నిక్ మెరుగుపర్చుకోవడం, స్పిన్నర్లతో పాటు పేసర్లను ఉతికిఆరేయడం, సూపర్ ఫామ్‌లో ఉండటంతో అతడి వైపు సెలెక్టర్లు మొగ్గు చూపిస్తున్నారట. భార్య రితికాకు డెలివరీ నేపథ్యంలో ఆసీస్ టూర్‌లో తొలి టెస్ట్‌కు రోహిత్ దూరం కానున్నాడని తెలుస్తోంది.


పర్ఫెక్ట్ రీప్లేస్‌మెంట్

రోహిత్ స్థానంలో తొలుత కేఎల్ రాహుల్ లేదా అభిమన్యు ఈశ్వరన్‌ను ఆడించాలని సెలెక్టర్లు భావించారు. అందుకే రాహుల్‌ను హుటాహుటిన ఆస్ట్రేలియా ఏతో మ్యాచ్‌ కోసం ఆసీస్‌కు పంపించారు. కానీ వీళ్లిద్దరూ ఆ టెస్ట్‌లో విఫలమయ్యారు. దీంతో యశస్వి జైస్వాల్‌కు జతగా సంజూను తీసుకోవాలని అనుకుంటున్నారట. శుబ్‌మన్ గిల్ రూపంలో మరో ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ రోహిత్ మాదిరిగా దేనికీ భయపడకుండా బాదుడే మంత్రంగా ఆడే సత్తా ఉన్న శాంసనే కరెక్ట్ రీప్లేస్‌మెంట్ అని బోర్డు పెద్దలు కూడా డిసైడ్ అయ్యారట. ఈ వార్త విన్న నెటిజన్స్.. సంజూకు అదృష్టం పట్టిందని, ఇక అతడ్ని ఎవరూ ఆపలేరని అంటున్నారు. టీ20 టు టెస్టులకు రూట్ పడిందని, నువ్వు తోపు బాస్ అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే కంగారూ టూర్‌కు శాంసన్‌ను తీసుకెళ్తారా? లేదా? అనేది టీమ్ సెలెక్షన్ టైమ్‌లోనే క్లారిటీ రానుంది.


Also Read:

గంభీర్‌నే ఎందుకు బలిచేస్తున్నారు.. రోహిత్ తప్పులు కనిపించట్లేదా..

ఆసీస్‌ను వదలని జురెల్.. మరోమారు వణికించాడు

సముద్రంలో ధోని.. ఒడ్డున గమనిస్తున్నది ఎవరో తెలుసా..

For More Sports And Telugu News

Updated Date - Nov 09 , 2024 | 09:35 PM