Pakistan: పాకిస్థాన్ గాలి తీసిన అక్తర్.. మీరు మారరు అంటూ..
ABN, Publish Date - Dec 02 , 2024 | 01:27 PM
Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో పాకిస్థాన్ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. అయితే అటు నుంచి బీసీసీఐ, ఇటు నుంచి ఐసీసీ పెడుతున్న ఒత్తిడికి ఎట్టకేలకు పీసీబీ దిగొచ్చింది. కానీ పీసీబీ తీరుపై అక్కడి మాజీ క్రికెటర్లు సీరియస్ అవుతున్నారు.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో పాకిస్థాన్ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. భద్రతా కారణాల రీత్యా పాక్‌లో ఆడేందుకు భారత్ నో చెప్పినా దాయాది వినలేదు. టీమిండియా తమ దేశానికి రావాల్సిందేనని పట్టుబట్టింది. అయితే అటు నుంచి బీసీసీఐ, ఇటు నుంచి ఐసీసీ ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకు పీసీబీ దిగొచ్చింది. హైబ్రిడ్ మోడల్‌లో మ్యాచుల నిర్వహణకు ఓకే చెప్పింది. అయితే సెక్యూరిటీ రీజన్స్‌తో తమ దేశానికి వచ్చేందుకు నిరాకరించిన భారత్‌కు మరోమారు మోకాలు అడ్డు పెట్టింది. టీమిండియా రాలేదు కాబట్టి భవిష్యత్తులో భారత్‌లో జరిగే ఐసీసీ టోర్నీల్లో తాము ఆడబోమంటూ కొత్త మెలిక పెట్టింది. తమ మ్యాచుల్ని కూడా అప్పుడు తటస్థ వేదికలపై నిర్వహించాలని ట్విస్ట్ ఇచ్చింది. దీనిపై పాక్ లెజెండ్ షోయబ్ అక్తర్ స్పందించాడు. మీరు ఇక మారరు అంటూ పీసీబీపై సీరియస్ అయ్యాడు.
పిచ్చి నిర్ణయం
హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా వచ్చే ఆదాయంలో అధిక వాటాను పాక్ బోర్డు డిమాండ్ చేయడంలో తప్పు లేదన్నాడు షోయబ్ అక్తర్. ఇది కరెక్ట్ డెసిషన్ అని సమర్థించాడు. అయితే ఫ్యూచర్‌లో ఐసీసీ ఈవెంట్స్ కోసం భారత్‌కు వెళ్లకూడదనేది మాత్రం సరికాదని.. ఇది కరెక్ట్ కాదంటూ పీసీబీపై సీరియస్ అయ్యాడు. ఐసీసీ ఈవెంట్స్ కోసం పాక్ జట్టును ఇండియాకు పంపాలని.. అక్కడ సొంతగడ్డపై ఆతిథ్య జట్టును ఓడించాలని సూచించాడు అక్తర్. అంతేగానీ అక్కడికి టీమ్‌ను పంపబోం అనడం పిచ్చి నిర్ణయమంటూ పీసీబీ గాలి తీసేశాడు.
భారత్‌ను ఓడిస్తేనే మజా
‘పాకిస్థాన్‌లో నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా రావడానికి ఇష్టపడకపోతే అది వారి నిర్ణయం. అది వారి ఇష్టానికే వదిలేయాలి. ఆ జట్టు రావడం లేదు కాబట్టి ఎక్కువ రెవెన్యూను పంచాలని పీసీబీ డిమాండ్ చేయడంలో తప్పు లేదు. అయితే.. ఫ్యూచర్‌లో ఇండియాలో జరిగే ఐసీసీ టోర్నీల్లో పాల్గొనే విషయంలో కాస్త ఆలోచించాలి. ఆ దేశానికి మనం స్నేహహస్తం చాటాలి. అలాగే అక్కడికి వెళ్లి భారత్‌ను వారి సొంతగడ్డ మీదే ఓడించాలి. అందుకు అనుగుణంగా టీమ్, వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి’ అని అక్తర్ వ్యాఖ్యానించాడు.
Also Read:
ఆ సెర్టిఫికెట్ ఉంటేనే షమీకి ఎంట్రీ.. బీసీసీఐ కొత్త మెలిక
కెప్టెన్ ఎక్స్‌ప్రెషన్ ఏంటి అలా ఉంది.. రోహిత్ పై కామెంటేటర్ కామెంట్
టీమిండియాకి ప్యాకేజీ స్టార్.. అలాంటి క్రికెటర్ ప్రపంచంలోనే లేడు: ఇంగ్లండ్
For More Sports And Telugu News
Updated Date - Dec 02 , 2024 | 01:32 PM