Shreyas Iyer: అయ్యర్ మెరుపు సెంచరీ.. వాళ్ల మీద కసితో చెలరేగాడు
ABN, Publish Date - Nov 06 , 2024 | 05:35 PM
Shreyas Iyer: స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరోమారు చెలరేగాడు. వాళ్ల మీద ఉన్న కసిని బంతి మీద చూపించాడు. మెరుపు సెంచరీతో వారికి సవాల్ విసిరాడు.
స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరోమారు చెలరేగాడు. రంజీ ట్రోఫీ-2024లో ఆడుతున్న ఈ ముంబైకర్ వరుసగా రెండు మ్యాచుల్లో రెండు సెంచరీలు బాదాడు. ఈ సీజన్‌లో మొదట మహారాష్ట్ర మీద శతకంతో వీరివిహారం చేసిన ఈ స్టార్ ప్లేయర్.. తాజాగా ఒడిషాపై మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. 101 బంతుల్లోనే మూడంకెల మార్క్‌ను చేరుకొని తన బ్యాట్ పవర్ ఏంటో ఇంకోసారి చూపించాడు.
ఇదేం బాదుడు సామి..
సూపర్ సెంచరీతో చెలరేగిన అయ్యర్.. శతకం మార్క్‌కు చేరుకునే క్రమంలో భారీ షాట్లు బాదాడు. 14 బౌండరీలతో పాటు 2 బిగ్ సిక్సులు కొట్టాడు. ఆ బౌలర్, ఈ బౌలర్ అనే తేడాల్లేకుండా అందర్నీ ఉతికి ఆరేశాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో ఈ స్టైలిష్ బ్యాటర్‌కు ఇది 15వ సెంచరీ కావడం విశేషం. అయ్యర్‌తో పాటు యంగ్‌స్టర్ అంగ్క్రిష్ రఘువంశీ (124 బంతుల్లో 92), సిద్ధేష్ లాడ్ (234 బంతుల్లో 116 నాటౌట్) కూడా అదరగొట్టడంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ముంబై భారీ స్కోరు దిశగా సాగుతోంది.
సెలెక్టర్లకు సవాల్
సెంచరీ పూర్తి చేసుకున్న సిద్ధేష్‌తో పాటు అయ్యర్ ఇంకా క్రీజులోనే ఉన్నాడు. శ్రేయస్ స్కోరు ఇప్పుడు 152. అతడు ఇదే ఊపులో ఆడితే డబుల్ సెంచరీ మార్క్‌ను అలవోకగా చేరుకోవచ్చు. ప్రస్తుతం ముంబై 3 వికెట్ల నష్టానికి 385 పరుగులతో ఉంది. ఇక, అయ్యర్ రాణించినా మరో సీనియర్ బ్యాటర్, కెప్టెన్ అజింక్యా రహానె (0) మాత్రం గోల్డెన్ డకౌట్ అయ్యాడు. రహానె ఔట్ అయ్యాక బాధ్యత తీసుకొని ఇన్నింగ్స్‌ను బిల్డ్ చేస్తూ పోయాడు అయ్యర్. టెస్టుల్లో తనను పట్టించుకోకపోవడంతో ఫీల్ అయిన ఈ బ్యాటర్ వరుస సెంచరీలతో సెలెక్టర్లకు గట్టి సవాల్ విసిరాడు. తనను ఎలాగైనా జట్టులోకి తీసుకోవాల్సిందేనని బ్యాట్‌తో హెచ్చరికలు పంపించాడు. బాల్‌ను కసితీరా బాదాడు.
Also Read:
కోహ్లీకి ఘోర అవమానం.. పదేళ్లలో ఇదే ఫస్ట్ టైమ్
రీటైన్ చేయకపోయినా ఆర్సీబీతోనే మ్యాక్స్‌వెల్.. ఇదెక్కడి ట్విస్ట్
రోహిత్-కోహ్లీకి కైఫ్ వార్నింగ్.. కట్ చేయాలంటూ..
For More Sports And Telugu News
Updated Date - Nov 06 , 2024 | 05:41 PM