ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Shreyas Iyer: అయ్యర్ ఈజ్ బ్యాక్.. టీమిండియాలోకి రీఎంట్రీ

ABN, Publish Date - Nov 07 , 2024 | 04:59 PM

Shreyas Iyer: స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు. వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్న అతడు.. డబుల్ సెంచరీతో తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు.

Ranji Trophy 2024: ‘గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస.. గర్జన కంటే భయంకరంగా ఉంటుంది’ అనే పాపులర్ మూవీ డైలాగ్ వినే ఉంటారు. ఇది నిజమని నిరూపించే పనిలో బిజీగా ఉన్నాడు స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. దేశవాళీ క్రికెట్‌లో ఆడాలనే తమ ఆదేశాలను పెడచెవిన పెట్టాడని అప్పట్లో బీసీసీఐ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బోర్డు, సెలెక్టర్ల మీద కసిగా ఉన్న స్టార్ బ్యాటర్.. ఆ కోపాన్ని బంతి మీద చూపిస్తున్నాడు. బాల్‌ను కసి తీరా బాదుతూ టీమిండియా తలుపులు గట్టిగా తడుతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు కొడుతూ సెన్సేషన్‌గా మారిన అయ్యర్.. తాజాగా డబుల్ సెంచరీ కొట్టి సెలెక్టర్లకు హెచ్చరికలు పంపించాడు.


కసిగా కొడుతున్నాడు

భారత టెస్ట్ జట్టులో చోటే లక్ష్యంగా ఆడుతున్న అయ్యర్.. రంజీ ట్రోఫీలో చెలరేగుతున్నాడు. ఇప్పటికే రెండు శతకాలు బాదిన స్టార్ బ్యాటర్.. ఒడిశాతో మ్యాచ్‌లో ద్విశతకం మార్క్‌ను చేరుకున్నాడు. మొత్తంగా 228 బంతుల్లో 233 పరుగులు చేశాడు. అందులో 24 బౌండరీలు, 9 భారీ సిక్సులు ఉన్నాయి. 100కు పైగా స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. దీన్ని బట్టే అతడి బ్యాట్ ఏ రేంజ్‌లో గర్జించిందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్‌ల్లో భారత జట్టులో చోటు దక్కకపోవడంతో కసి మీద ఉన్న అయ్యర్.. తాజా డబుల్ సెంచరీతో తాను రీఎంట్రీ కోసం పూర్తిగా సిద్ధంగా ఉన్నానని చాటి చెప్పాడు. అతడి ఆట చూస్తుంటే త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తప్పక తీసుకుంటారని అనిపిస్తోంది.


ఆ ఒక్కటే అడ్డంకి

ఇటీవల కాలంలో టీమిండియా మిడిలార్డర్ చాలా బలహీనంగా మారింది. కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ అంచనాలకు తగ్గట్లుగా ఆడకపోవడం టీమ్‌ను ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో రంజీల్లో అదరగొడుతున్న అయ్యర్‌ను తిరిగి జట్టులోకి తీసుకునే ఛాన్సులు కనిపిస్తున్నాయి. కానీ పేస్, బౌన్స్‌కు పెట్టింది పేరైన ఆసీస్ పిచ్‌ల మీద అయ్యర్ రాణించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బౌన్సర్లను ఆడటంలో అతడికి ఉన్న వీక్‌నెస్‌ దీనికి కారణంగా చూపిస్తున్నారు. జట్టులోకి రావడానికి అదొక్కటే అడ్డంకి అంటున్నారు. దీంతో కంగారూ టూర్‌కు అయ్యర్ ఎంపిక అవుతాడా? కాదా? అనేది ఆసక్తిగా మారింది. అయితే తన బ్యాటింగ్ టెక్నిక్ విషయంలో శ్రేయస్ ఇంప్రూవ్ అవడం, వరుస సెంచరీలతో భీకర ఫామ్‌లో ఉండటంతో అతడి రీఎంట్రీ ఖాయమని నెటిజన్స్ అంటున్నారు. అయ్యర్ విషయంలో సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


Also Read:

ఆసీస్‌కు పోయించిన జురెల్.. సోల్జర్ కొడుకు కదా ఆ మాత్రం ఉంటది

ఆఫ్ఘాన్ నుంచి మరో డేంజర్ స్పిన్నర్.. ఎవరీ అల్లా ఘజన్‌ఫర్?

టాప్‌సీడ్‌కు రిత్విక్‌ జోడీ షాక్‌

For More Sports And Telugu News

Updated Date - Nov 07 , 2024 | 05:07 PM