ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Shreyas Iyer: ఆక్షన్‌లో సరికొత్త రికార్డు.. స్టార్క్‌ను దాటేసిన శ్రేయస్ అయ్యర్‌!

ABN, Publish Date - Nov 24 , 2024 | 04:20 PM

Shreyas Iyer: ఐపీఎల్ వేలంలో పాత రికార్డులకు పాతర వేశాడు శ్రేయస్ అయ్యర్. ఈ టీమిండియా స్టైలిష్ బ్యాటర్ ఊహించని ధరకు అమ్ముడుపోయాడు.

IPL 2025 Mega Auction: ఐపీఎల్ వేలంలో పాత రికార్డులకు పాతర వేశాడు శ్రేయస్ అయ్యర్. ఈ టీమిండియా స్టైలిష్ బ్యాటర్ ఊహించని ధరకు అమ్ముడుపోయాడు. ఏకంగా రూ.26.75 కోట్ల భారీ ధర పెట్టి అతడ్ని కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. గత ఐపీఎల్‌లో మిచెల్ స్టార్క్ (రూ.24.75 కోట్లు)నే ఇప్పటివరకు ఆక్షన్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఉన్నాడు. ఇప్పుడా రికార్డును అయ్యర్ బ్రేక్ చేశాడు.


హైలైట్స్ ఇవే..

ఇవాళ ఆక్షన్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ హైలైట్‌గా నిలిచారు. వీళ్లిద్దరూ రికార్డుల పంట పండించాడు. ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా చరిత్ర సృష్టించారు. పంత్‌ను రూ.27 కోట్ల భారీ ధరకు లక్నో సూపర్ జియాంట్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. అయ్యర్‌ను రూ.26.75 కోట్లు చెల్లించి పంజాబ్ కింగ్స్ కొనుక్కుంది. లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఈసారి స్పెషల్ హైలైట్‌గా నిలిచారు. రూ.18 కోట్ల అర్ష్‌దీప్‌ను ఆర్టీఎం కార్డు ద్వారా పంజాబ్ తీసేసుకుంది. అంతే ధరకు చాహల్‌ను అదే జట్టు సొంతం చేసుకుంది. ఆక్షన్‌లో కేఎల్ రాహుల్‌కు నిరాశ మిగిలింది అతడ్ని రూ.14 కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది. కనీసం రూ.25 కోట్ల వరకు వస్తాడనుకుంటే చాలా తక్కువ ధరకు అతడు అమ్ముడుపోయాడు. రబాడ (రూ.10.75 కోట్లు)ను గుజరాత్ టైటాన్స్, మహ్మద్ షమి (రూ.10 కోట్లు) సన్‌రైజర్స్ హైదరాబాద్, లియామ్ లివింగ్‌స్టన్ (రూ.8.75 కోట్లు)ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, డేవిడ్ మిల్లర్ (రూ.7.5 కోట్లు) లక్నో సూపర్ జియాంట్స్ సొంతం చేసుకున్నాయి.


Also Read:

చరిత్ర సృష్టించిన కోహ్లీ.. సచిన్ రికార్డుకు పాతర

షమీని ఎగరేసుకుపోయిన సన్‌రైజర్స్.. కావ్య పాప అనుకున్నది సాధించింది

అభిమానులకు సర్‌ప్రైజ్.. సీక్రెట్‌గా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన స్టార్ ప్లేయర్

For More Sports And Telugu News

Updated Date - Nov 24 , 2024 | 06:23 PM