Cricket: టీమిండియా క్రికెటర్ రిటైర్మెంట్.. SRH ఫ్యాన్స్ ఇతడ్ని మర్చిపోలేరు
ABN, Publish Date - Nov 28 , 2024 | 09:50 PM
టీమిండియాకు సేవలు అందించిన ఓ క్రికెటర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. జెంటిల్మన్ గేమ్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే..?
టీమిండియాకు సేవలు అందించిన ఓ క్రికెటర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. జెంటిల్మన్ గేమ్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు. భారత జట్టు తరఫున కొన్నాళ్ల పాటే ఆడినా మంచి ఇంపాక్ట్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఫ్యూచర్‌లో స్టార్‌గా రాణిస్తాడని అంతా భావించారు. కానీ అతడు తక్కువ సమయంలోనే మెన్ ఇన్ బ్లూకు దూరమయ్యాడు. తన ఫ్రెండ్ విరాట్ కోహ్లీ రేంజ్‌లో సక్సెస్ కావాలని కలలుగన్నాడు. కానీ అతడి ఆశలు నెరవేరలేదు. అయితే డొమెస్టిక్ క్రికెట్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం దుమ్మురేపాడు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
దేశవాళీల్లో తోపు
వెటరన్ పేసర్ సిద్ధార్థ్ కౌల్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు. భారత జట్టు తరఫున 3 వన్డేలు, 3 టీ20లు ఆడిన కౌల్.. ఓవరాల్‌గా 4 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా తరఫున అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చిన అరకొర ఛాన్సుల్ని అతడు సద్వినియోగం చేసుకోకపోవడం, టీమ్‌లో బెర్త్‌ల కోసం తీవ్ర పోటీ ఉండటంతో కౌల్ తిరిగి కమ్‌బ్యాక్ చేయలేకపోయాడు. ఇంటర్నేషనల్ లెవల్‌లో పెద్దగా ఆడకపోయినా దేశవాళీల్లో మాత్రం సిద్ధార్థ్ తనదైన ముద్ర వేశాడు. 88 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 297 వికెట్లతో తోపు బౌలర్‌గా గుర్తింపు సంపాదించాడు.
వేలంలో మొండిచెయ్యి
లిస్ట్-ఏలో 111 మ్యాచుల్లో 199 వికెట్లు పడగొట్టాడు సిద్దార్థ్ కౌల్. ఇతడు తెలుగు వారికీ సుపరిచితుడే. 2018 నుంచి 2021 వరకు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తరఫున ఆడుతూ ఇక్కడి వారి మనసులు గెలుచుకున్నాడు కౌల్. ఇటీవల జరిగిన మెగా ఆక్షన్‌లో అతడ్ని ఏ ఫ్రాంచైజీ తీసుకోకపోవడంతో కౌల్ రిటైర్మెంట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు. కాగా, 2008లో అండర్-19 భారత జట్టులో విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడాడు కౌల్. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.
Also Read:
పేరుకే రూ.27 కోట్లు.. పంత్‌కు దక్కేది ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
రోహిత్, కోహ్లీ కాదు.. ఆ భారత క్రికెటరే స్టార్ అంటున్న ఆస్ట్రేలియా ప్రధాని
జైస్వాల్ విషయంలో తప్పు చేశా.. ద్రవిడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
For More Sports And Telugu News
Updated Date - Nov 28 , 2024 | 09:56 PM