మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

SRH vs GT: టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. తుది జట్లు ఇవే!

ABN, Publish Date - Mar 31 , 2024 | 03:09 PM

గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు.

SRH vs GT: టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. తుది జట్లు ఇవే!

అహ్మదాబాద్: గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు (Gujarat Titans vs Sunrisers Hyderabad) ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందుగా బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌కు తమ తుది జట్టులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ గుజరాత్ మాత్రం రెండు మార్పులు చేసింది. స్పెన్సర్ జాన్సన్ స్థానంలో నూర్ అహ్మద్, సాయి కిషోర్ స్థానంలో దర్శన్ నల్కండేను జట్టులోకి తీసుకున్నట్టు టాస్ సమయంలో కెప్టెన్ గిల్ (Shubman Gill) చెప్పాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. రెండిటిలో గుజరాత్, ఒక దాంట్లో సన్‌రైజర్స్ గెలిచాయి.

తుది జట్లు

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే

సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మాక్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 31 , 2024 | 03:17 PM

Advertising
Advertising