ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

SRH vs KKR: ఆండ్రూ రస్సెల్ విధ్వంసం.. హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం

ABN, Publish Date - Mar 23 , 2024 | 09:32 PM

కోల్‌కతా నైట్ రైడర్స్ బిగ్ హిట్టర్ ఆండ్రూ రస్సెల్ విధ్వంసం సృష్టించాడు. చాలా రోజుల తర్వాత ఐపీఎల్‌లో తన మార్కు బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ఊచకోత కోశాడు. 25 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రస్సెల్ ఇన్నింగ్స్‌లో 7 సిక్సులు ఉన్నాయంటనే అతని విధ్వంసం ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు.

కోల్‌కతా: కోల్‌కతా నైట్ రైడర్స్ బిగ్ హిట్టర్ ఆండ్రూ రస్సెల్ విధ్వంసం సృష్టించాడు. చాలా రోజుల తర్వాత ఐపీఎల్‌లో తన మార్కు బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ఊచకోత కోశాడు. 25 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రస్సెల్ ఇన్నింగ్స్‌లో 7 సిక్సులు ఉన్నాయంటనే అతని విధ్వంసం ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. రస్సెల్‌కు తోడు ఫిలిప్ సాల్ట్(54) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు కోల్‌కతానైట్ రైడర్స్ 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 25 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రస్సెల్ 7 సిక్సులు, 3 ఫోర్లతో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రస్సెట్ స్ట్రైక్ రేటు ఏకంగా 256గా ఉంది. రస్సెల్, సాల్ట్‌కు తోడుగా రమణ్‌దీప్ సింగ్(35), రింకూ సింగ్(23) కూడా కీలక సమయాల్లో మెరుపులు మెరిపించడంతో కోల్‌కతానైట్ రైడర్స్ జట్టు భారీ స్కోర్ సాధించింది. రస్సెల్ విధ్వంసాన్ని తట్టుకుని సైతం పొదుపుగా బౌలింగ్ చేసిన టి. నటరాజన్(3/32) సత్తా చాటాడు.


టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన అతిథ్య జట్టు కోల్‌కతానైట్ రైడర్స్.. సన్‌రైజర్స్ హైదారాబాద్ పేసర్ల ధాటికి పవర్‌ ప్లేలోనే 3 కీలక వికెట్లు కోల్పోయింది. రెండో ఓవర్లోనే సునీల్ నరైన్ (2) రనౌట్ అయ్యాడు. అయితే మార్కో జాన్సన్ వేసిన ఆ ఓవర్లో అంతకుముందే ఫిలిప్ సాల్ట్ హ్యాట్రిక్ సిక్సులు కొట్టాడు. దీంతో ఆ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. నాలుగో ఓవర్లో హైదరాబాద్ బౌలర్ టి. నటరాజన్ చెలరేగాడు. వెంకటేష్ అయ్యర్(7)తోపాటు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను డకౌట్ చేశాడు. దీంతో 32 పరుగులకే కేకేఆర్ 3 వికెట్లు కోల్పోయింది. ఆ కాసేపటికే నితీష్ రానా(9)ను స్పిన్నర్ మయాంక్ మార్కండే పెవిలియన్ చేర్చాడు. దీంతో 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన కోల్‌కతా కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో కేకేఆర్‌ను రమణ్‌దీప్ సింగ్‌తో కలిసి ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఆదుకున్నాడు. వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ తాను మాత్రం పట్టుదలగా ఆడాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని 13వ ఓవర్‌లో కెప్టెన్ పాట్ కమిన్స్ విడదీశాడు. ఒక ఫోర్, 4 సిక్సులతో 17 బంతుల్లోనే 35 పరుగులు చేసిన రమణ్‌దీప్ సింగ్‌ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 105 పరుగులకు కేకేఆర్ సగం వికెట్లు కోల్పోయింది. అనంతరం 38 బంతుల్లో సాల్ట్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో సాల్ట్‌కు ఇది రెండో హాఫ్ సెంచరీ. 3 ఫోర్లు, 3 సిక్సులతో 40 బంతుల్లో 54 పరుగులు చేసిన సాల్ట్.. మార్కండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 119 పరుగులకు కోల్‌కతా 6 వికెట్లు కోల్పోయింది.

ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన రస్సెల్ ఊచకోత కోశాడు. సన్‌రైజర్స్ బౌలర్లను ఉతికారేస్తూ పరుగుల వరద పారించాడు. ఐపీఎల్‌లో చాలా కాలం తర్వాత తన మార్కు షాట్లతో పరుగుల వరద పారించాడు. రస్సెల్‌కు రింకూ సింగ్ కూడా సహకరించాడు. రస్సెల్ దెబ్బకు అప్పటివరకు జాగ్రత్తగా బౌలింగ్ చేసిన హైదరాబాద్ బౌలర్లు గాఢి తప్పారు. ముఖ్యంగా పవర్ ప్లేలో 7 పరుగులు మాత్రమే ఇచ్చిన భువనేశ్వర్ కుమార్ డెత్ ఓవర్లలో ఏకంగా 44 పరుగులు సమర్పించుకున్నాడు. స్పిన్నర్ మయాంక్ మార్కండే వేసిన 16వ ఓవర్‌లో రస్సెల్ 3 సిక్సులు బాదడంతో ఊచకోత మొదలైంది. భువనేశ్వర్ వేసిన 17వ ఓవర్‌లో రస్సెల్ ఓ సిక్సు, ఫోర్.. రింకూ సింగ్ ఓ ఫోర్ బాదడంతో 18 పరుగులొచ్చాయి. నటరాజన్ వేసిన 18వ ఓవర్‌లో రస్సెల్ ఓ సిక్సు, రింకూ ఓ ఫోర్ బాదడంతో 15 పరుగులొచ్చాయి. భువి వేసిన 19వ ఓవర్‌లో రస్సెల్ 2 ఫోర్లు, 2 సిక్సులు బాదాడు. ఓ నో బాల్ కూడా పడడం కలిసొచ్చింది. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 26 పరుగులొచ్చాయి. దీంతో కేకేఆర్ స్కోర్ కూడా 200కు చేరుకుంది. ఈ క్రమంలో రస్సెల్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో రస్సెల్‌కు ఇది 10వ హాఫ్ సెంచరీ. నటరాజ్ వేసిన చివరి ఓవర్ మొదటి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన రింకూ సింగ్ ఔటయ్యాడు. 3 ఫోర్లతో 15 బంతుల్లో రింకూ 23 పరుగులు చేశాడు. రస్సెల్, రింకూ కలిసి 7వ వికెట్‌కు 32 బంతుల్లోనే 81 పరుగులు జోడించారు. ఆ తర్వాత కూడా నటరాజన్ కట్టడి చేయడంతో ఆ ఓవర్లో 8 పరుగులే వచ్చాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతానైట్ రైడర్స్ జట్టు 208/7 స్కోర్ చేసింది. రస్సెల్(64), స్టార్క్ (6) నాటౌట్‌గా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 3, మార్కండే 2, కమిన్స్ ఒక వికెట్ తీశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 23 , 2024 | 09:53 PM

Advertising
Advertising