ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

SRH vs MI: టాస్ గెలిచిన ముంబై.. రెండు జట్లలో కీలక మార్పులు!

ABN, Publish Date - Mar 27 , 2024 | 07:15 PM

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Sunrisers Hyderabad vs Mumbai Indians) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో ముంబై తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. ల్యూక్ వుడ్ స్థానంలో క్వేనా మఫాకాను తుది జట్టులోకి తీసుకుంది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా తమ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. మార్కో జాన్సెన్ స్థానంలో ట్రావిస్ హెడ్‌ను, నటరాజన్ స్థానంలో జయదేవ్ ఉనద్కత్‌ను తుది జట్టులోకి తీసుకుంది. రెండు జట్లు తమ ఆరంభ పోరులో ఓడిపోవడంతో ఈ మ్యాచ్‌లో గెలిచి సీజన్‌లో బోణీ చేయాలని పట్టుదలగా ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటివరకు 21 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అత్యధికంగా ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్‌ల్లో, సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో గెలిచాయి. రెండు జట్ల పోటీలో హైదరాబాద్ అత్యధిక స్కోర్ 200 కాగా.. ముంబైది 235గా ఉంది. హైదరాబాద్ అత్యల్ప స్కోర్ 96 కాగా.. ముంబైది 87గా ఉంది. గత సీజన్‌లో జరిగిన 2 మ్యాచ్‌ల్లో ముంబై జట్టే గెలిచింది.


సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, మాక్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్

ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, షామ్స్ ములానీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, క్వేనా మఫాకా

Updated Date - Mar 27 , 2024 | 07:17 PM

Advertising
Advertising