Steve Smith: తగలరాని చోట తగిలిన బంతి.. స్మిత్ రియాక్షన్ వైరల్
ABN, Publish Date - Dec 26 , 2024 | 01:54 PM
IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్‌లో తొలి రోజు ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి. తొలి రెండు సెషన్లు ఆసీస్, ఆఖరి సెషన్‌లో భారత్ ఆధిపత్యం చూపించాయి. అయితే ఆట కంటే కూడా మొదటి రోజు గ్రౌండ్‌లో జరిగిన పలు ఘటనలు హైలైట్‌గా నిలిచాయి.
Boxing Day Test: బాక్సింగ్ డే టెస్ట్‌లో తొలి రోజు ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి. తొలి రెండు సెషన్లు ఆసీస్, ఆఖరి సెషన్‌లో భారత్ ఆధిపత్యం చూపించాయి. అయితే ఆట కంటే కూడా మొదటి రోజు గ్రౌండ్‌లో జరిగిన పలు ఘటనలు హైలైట్‌గా నిలిచాయి. కింగ్ విరాట్ కోహ్లీతో జూనియర్ పాంటింగ్ గొడవ, జైస్వాల్‌కు రోహిత్ శర్మ వార్నింగ్ ఇలా పలు ఘటనలు మ్యాచ్‌లో హీటెక్కించాయి. ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు బంతి తగలడం, అతడి రియాక్షన్ కూడా వైరల్‌గా మారాయి. అసలేం జరిగింది? స్మిత్ రియాక్షన్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
భారత బౌలర్లను కాచుకొని..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదట్లో తీవ్రంగా ఇబ్బంది పడిన స్మిత్.. క్రమంగా గాడిన పడ్డాడు. మంచి నాక్స్‌తో తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. దాన్నే బాక్సింగ్ డే టెస్ట్‌లోనూ కంటిన్యూ చేశాడు. ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 111 బంతుల్లో 68 పరుగులు చేశాడు స్మిత్. తొలి రోజు ముగిసేసరికి అతడు నాటౌట్‌గా నిలిచాడు. సాలిడ్ డిఫెన్స్, మంచి స్ట్రైక్ రొటేషన్‌తో టీమిండియా బౌలర్లను ఇబ్బంది పెట్టాడు స్మిత్. మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా తాను మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు. దీంతో అతడ్ని టార్గెట్ చేసుకొని భారత బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు వేశారు. ఇదే క్రమంలో ఆకాశ్‌దీప్ వేసిన ఓ డెలివరీ స్మిత్‌కు తగలరాని చోట తగిలింది.
నొప్పితో తల్లడిల్లాడు
గుడ్ లెంగ్త్‌లో పడిన బంతి ఇన్ స్వింగ్ అయింది. పడిన చోటు నుంచి లోపలకు దూసుకొచ్చిన బంతిని డిఫెన్స్ చేయబోయి విఫలమయ్యాడు స్మిత్. అతడి బ్యాట్ అంచును దాటుకొని వెళ్లిన బంతి.. తగలరాని చోట తగిలింది. దీంతో ఆసీస్ బ్యాటర్ కాసేపు నొప్పితో తల్లడిల్లాడు. అయితే తక్కువ సమయంలోనే దాని నుంచి కోలుకున్న స్మిత్.. ఆకాశ్‌దీప్‌ను మెచ్చుకున్నాడు. అద్భుతమైన బంతి వేశావంటూ అతడ్ని ప్రశంసించాడు. నొప్పిని తట్టుకుంటూనే.. సూపర్ బాల్ అంటూ కామెంట్ చేశాడు. ఆ సమయంలో అతడి ముఖంలో కొంచెం బాధ, కొంచెం నవ్వు.. రెండూ కనిపించాయి. ఆ తర్వాత అతడు బ్యాటింగ్ కొనసాగించాడు. స్మిత్ ఫన్నీ రియాక్షన్ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. ఆకాశ్‌దీప్ దెబ్బకు కంగారూ స్టార్‌కు దేవుడు కనిపించాడని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read:
సస్పెన్షన్ సమయంలో టోర్నీలు ఎలా ఆడింది?
మనూ భాకర్‌కు ఖేల్‌రత్న?
నమన్ ఓఝా తండ్రికి జైలు
For More Sports And Telugu News
Updated Date - Dec 26 , 2024 | 01:54 PM